పోలీసుల తీరుపై కేంద్రమంత్రి అసంతృప్తి
హైదరాబాద్: లష్కర్ బోనాల సందర్భంగా మహంకాళీ అమ్మవారి దర్శనం కోసం కేంద్ర మంత్రి బండారు దత్తత్రేయ వచ్చారు. ఆలయ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సతీమణి అనారోగ్యంతో బాధపడుతోందని వాహనాన్ని ఆలయ సమీపం వరకు తీసుకెళ్లే విధంగా చూడమని పోలీసులను కోరినా లాభం లేకపోయింది. ఆలయం వద్దకు వాహనాలా రాకోపోకలు నిషేద్ధమని చాలా దూరంలోనే మంత్రి వాహనాన్ని నిలిపేశారు. స్థానికి ఎంపీ అయిన తనకు పోలీసులు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.