అర్ధరాత్రి కలకలం
►మంత్రి కార్యాలయంపై పెట్రో బాంబులతో దాడి
► అన్నాడీఎంకే కార్యాలయంపైనా నాటు బాంబులు
► మంత్రి సెల్లూరు కె. రాజు టార్గెట్‌గా దాడి?
సాక్షి, చెన్నై : మదురైలో అర్ధరాత్రి కలకలం రేగింది. మంత్రి సెల్లూరు కె. రాజును టార్గెట్ చేస్తూ, ఆయన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు నా టు, పెట్రోల్ బాంబులతో దాడికి దిగా రు. అన్నాడీఎంకే కార్యాలయంపై కూ డా పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫలితంగా కార్యాలయాలకు , చెన్నైలో ని సెల్లూరు కె. రాజు ఇంటికి భద్రతను పెంచారు. మదురైలో ఇటీవల కాలంగా అధికార అన్నాడీఎంకే వర్గాల మధ్య గ్రూ పు తగాదాలు రాజుకుంటూ వస్తున్నాయి. చాపకింద నీరులా కొందరు మంత్రి సెల్లూరు రాజుకు వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలెట్టారు.
అయి తే, సీఎం జయలలిత వద్ద మంత్రికి మంచి గుర్తింపు ఉండటంతో వ్యతిరేక శక్తులు కుదేల్ కాక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం నేతృత్వంలో ఓ కార్యక్రమానికి మదురైలో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ విషయంగా సెమ్మం పట్టిలోని తన కార్యాలయంలో పార్టీ వర్గాలతో పన్నెం డు గంటల వరకు మంత్రి సెల్లూరు రాజు సమాలోచనలో నిమగ్నం అయ్యా రు. తదుపరి అక్కడి నుంచి వెళ్లి పోయా రు. ఆయన అటు వెళ్లిన కాసేపటికే మోటారు సైకిళ్లపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబుల్ని విసిరారు. వరుసగా బాంబుల దాడి జరగడం, పెద్ద శబ్దం రావడంతో ఆ పరిసర వాసులు అటు వైపుగా పరుగులు తీశా రు.
దీంతో అక్కడి నుంచి ఆ వ్యక్తులు ఉడాయించారు. అదే సమయంలో మ దురై పనగల్ సాలైలో ఉన్న అన్నాడీఎం కే కార్యాలయంపై పెట్రోల్ బాంబు దా డి జరగడంతో కలకలం బయలుదేరిం ది. సమాచారం అందుకున్న కమిషనర్ శైలేష్‌కుమార్ నేతృత్వంలో అధికార వ ర్గాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ పెట్రోల్ బాంబు దా డిలో మంత్రి కార్యాలయం తలుపులు ధ్వంసం అయ్యాయి. అన్నాడీఎంకే కా ర్యాలయంలో విద్యుత్ లైట్లు దెబ్బతిన్నాయి. అక్కడ పేలకుండా పడి ఉన్న కొన్ని నాటు, పెట్రోబాంబుల్ని పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘట నల్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు యంత్రాంగం, దీనివెనుక ఉన్నవారి భ రతం పట్టేందుకు ఐదు బృందాల్ని రం గంలోకి దించారు.
తిరుమల నాయకర్ జయంతి అధికారిక ప్రకటన ప్రయత్నా ల సమయంలో తీవ్రంగా వ్యతిరేకించిన తమిళ సంఘం ఈ దాడి చేసి ఉండొచ్చ న్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. అదే సమయంలో అన్నాడీఎంకే లో సాగుతున్న గ్రూపు విభేదాలను కూ డా పోలీసులు పరిగణలోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. తన కా ర్యాలయం, పార్టీ కార్యాలయంపై దాడి సమాచారంతో ఉదయాన్నే అక్కడికి చేరుకుని మంత్రి సెల్లూరు రాజు పరిశీ లించారు. అయితే, మంత్రిని టార్గెట్ చేసి దాడికి వ్యూహ రచన జరిగి ఉండొచ్చని, ఆయన అక్కడి నుంచి వెళ్లి పోవ డం వల్ల పెను ప్రమాదం చోటు చేసుకోలేదని పలువురు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటన తో మదురైలోని సెల్లూరు రాజు ఇళ్లు, కార్యాల యాలకు, చెన్నై గ్రీన్ వేస్ రోడ్డులోని ఇంటివద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
పోలీసుల అదుపులో అనుమానితులు
ఈ దాడికి సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో అన్నాడీఎంకే కౌన్సిలర్ మురుగేషన్ సైతం ఉండడంతో దర్యాప్తును ముమ్మరంచేసి ఉన్నారు. గతవారం మదుర మీనాక్షి అమ్మవారి ఆలయ పరిసరాల్లో పెట్రో బాంబులు లభించిన ఘటన మరువక ముందే, ప్రస్తుతం మళ్లీ రాష్ర్ట మంత్రిని టార్గెట్ చేసి దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.