పోలీసులకు వాహనాలు అందజేత
పోలీసు శాఖకు వాహనాల అందజేత కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం జరిగింది. జిల్లాలోని బెల్లంపల్లిలో మంగళవారం జిల్లా పోలీసు శాఖకు 34 వాహనాలను రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంయుక్తంగా అందజేశారు. బెల్లంపల్లిలోని ఏఆర్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.