అత్యుత్తమ వర్సిటీ.. ఐఐఎస్సీ
జాతీయ స్థాయిలో యూనివర్సిటీల ర్యాంకులు విడుదల చేసిన హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: ప్రపంచ ర్యాంకుల్లో అత్యుత్తమ స్థానాలు సాధిస్తున్న బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) మరోసారి సత్తా చాటింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) సోమవారం విడుదల చేసిన వార్షిక ర్యాంకుల్లో ఓవరాల్ విభాగంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో ఐఐఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మద్రాస్) దక్కించుకుంది.