Minor Boy Suicide
-
ప్రియురాలు మాట్లాడటం లేదని ఓ మైనర్..
చాంద్రాయణగుట్ట: ప్రియురాలు మాట్లాడటం లేదని మనస్థాపానికి గురైన ఓ మైనర్ బాలుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ టి.సాయి కుమార్ గౌడ్ తెలిపిన మేరకు.. ఉప్పుగూడ కృష్ణారెడ్డి నగర్‌కు చెందిన యాదయ్యకు ఒక కుమారుడు బి.నరేష్(16), ఇద్దరు కుమార్తెలు. నరేష్ ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో చాంద్రాయణగుట్టలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ నెల 23న ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్లిన నరేష్ రాత్రి సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నైట్ షిప్ట్ కూడా డ్యూటీ ఉందని...ఇంటికి రావడం లేదని తెలిపాడు. బుధవారం ఉదయం తల్లిదండ్రులిద్దరూ వారి వారి పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న నరేష్ ఇంటి పైకప్పు రేకుల పైప్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి తలుపులు నెట్టినా రాకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు తీసి లోపలికి వెళ్లి చూడగా నరేష్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఓ బాలికతో నరేష్ ప్రేమలో ఉన్నాడని....ఇటీవల ఆ బాలిక మాట్లాడకపోవడంతో వారం రోజుల నుంచి ముభా వంగా ఉన్నాడని....ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నైట్ డ్యూటీ అని చెప్పి...ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైన నరేష్.. తాను నైట్ డ్యూటీ చేస్తున్నానని ఇంటికి ఫోన్ చేసిన నరేష్....స్నేహితుడి జన్మదిన వేడుకలకు హాజరైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. స్నేహితులంతా కలిసి మంగళవారం రాత్రి విందు చేసుకొని బుధవారం మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కరుగా తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. నరేష్ ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి అతని స్నేహితులే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. ఎప్పుడు చూసినా స్నేహితులు...స్నేహితులంటూ వెళ్లేవాడని...చెడు స్నేహం కారణంగానే తమకొడుకును పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. -
మైనర్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య
కాన్పూర్: మైనర్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. అభిషేక్ (15) అనే విద్యార్థి ట్యుషన్ నుంచి తిరిగి వచ్చి ఇంట్లో ఈ సంఘటనకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఆ సమయంలో విద్యార్థి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. వైద్యుడిని కలిసేందుకు వెళ్లిన తాము ఇంటికి తిరిగివచ్చేసరికి తలుపుకు గడియ వేసి వుందని, ఎంత పిలిచినా అభిషేక్ నుంచి స్పందన రాకపోవడంతో తలుపును పగలకొట్టినట్టుగా వారు తెలిపారు. తాము లోపలికి వెళ్లి చూడగా ఫ్యానుకు వేలాడుతున్న అభిషేక్ ను గుర్తించమని, అయితే అప్పటికే తమ కుమారుడు మృతిచెందినట్టు వెల్లడించారు. కాగా అభిషేక్ ఆత్మహత్యకు గల కారణాలపై ట్యూషన్ టీచర్ ను, తల్లిదండ్రులను విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.