Minor injuries
-
చెట్టును ఢీకొన్నస్కూల్ బస్సు
♦ ఏడుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు ♦ అలియాబాద్ గ్రామ శివారులో ఘటన కొండాపూర్: డ్రైవర్ అజాగ్రత్త వల్ల స్కూల్ బస్సు చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని అలియాబాద్ గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. చెర్లగోపులారం, తేర్పోల్, కొండాపూర్ తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు సంగారెడ్డి పట్టణంలోని కాకతీయ పాఠశాలలో చదువుకుంటున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం కూడా పాఠశాల బస్సులో ఇళ్లకు వెళ్తుండగా అలియాబాద్ శివారు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనేగల చెట్టును ఢీకొంది. బస్సులో ఉన్న కొండాపూర్‌కు చెందిన శ్రీఖర్(7), శ్రీహర్షిణి(10), గోపులారానికి చెందిన సతీష్ (15), అరుణ్(13), ప్రదీప్ (14), రాజశేఖర్ (15), తేర్పోల్‌కు చెందిన సాయినాథ్ (12)లకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఫిట్నెస్ లేకపోవడం, అవగాహన లేని డ్రైవర్లు బస్సులు నడపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఆర్టీఏ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఏబీవీపీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు అభిలాష్ ఆరోపించారు. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేసి పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో హీరో భార్యకు గాయాలు
హైదరాబాద్ : ప్రముఖ నటుడు మోహన్ బాబు కోడలు, హీరో మంచు విష్ణు భార్య విరోనికా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జల్పల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విరోనికాతో పాటు మరొకరికి స్వల్పంగా గాయలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి జల్పల్లి ఫాంహౌస్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వోల్వో ఎస్‌యూవీలో వెళ్తుండగా స్వల్ప ప్రమాదం జరిగిందని, అది సురక్షితమైన వాహనం కావడంతో కొద్దిపాటి గాయాలతోనే విరోనికా బయటపడ్డారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. -
ప్రాణాలు కాపాడిన ఎయిర్ బెలూన్స్
కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు తృటిలో త ప్పిన ప్రమాదం చంద్రగిరిః కారులోని ఎయిర్ బెలూన్స్ వారికి శ్రీరామ రక్షగా నిలిచాయి. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కారును ఢీకొనడంతో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యి వారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాలు...తాడేపల్లిగూడెంకు చెందిన ఫణికుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఫణికుమార్ రెండు రోజుల క్రితం భార్య విజయ దుర్గ, కుమారుడు సుజన్‌తో కలసి తాడేపల్లిగూడెంలోని అత్తగారింటికి వెళ్లారు. ఆదివారం రాత్రి వారు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో మండలంలోని పూతలపట్టు-నాయుడు పేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో వేలూరు నుంచి తిరుమలకు వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఫణికుమార్ వాహనాన్ని ఢీకొని, రోడ్డుపక్కనే ఉన్నటువంటి గొయ్యిలో బోల్తా కొట్టింది. బస్సు ఢీకొనడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. అయితే వాహనాన్ని నడుపుతున్న సమయంలో ఫణికుమార్ సీటు బె ల్టు ధరించడంతో కారులో బెలూన్ ఓపెన్ అయ్యి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. విజయదుర్గ వెన్నుముకకు తీవ్ర గాయమవ్వడంతో ఆమెను చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ఎస్సై కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తుపాకీతో అత్తను కాల్చి చంపిన అల్లుడు
ఒకరికి తీవ్ర, మరొకరికి స్వల్పగాయాలు బేస్తవారిపేట : ఓ అల్లుడు నాటు తుపాకీతో అత్తను కాల్చి చంపాడు. ఇదే ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని పోగుళ్లలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన దొర తిరుమలమ్మ(55)కు పెద్దమల్లు అల్లూరయ్య అల్లుడు. ఈ నేపథ్యంలో గ్రామంలో పోలేరమ్మ కొలుపులు నిర్వహిస్తున్నారు. అల్లూరయ్య పూటుగా మద్యం తాగాడు. మేకలు మేపుకునే విషయంలో తిరుమలమ్మ కొడుకులు, అల్లునికి గొడవ జరిగింది. గొడవ పెద్దదవుతుండటంతో అల్లూరయ్యను భార్య తిరుపతమ్మ ఇంట్లో పెట్టి తలుపేసింది. ఇంట్లో ఉన్న నాటు తుపాకీతో తడికె తలుపు నుంచి అల్లూరయ్య బయటకు కాల్చాడు. ఇంటి బయట ఉన్న తిరుమలమ్మ పొట్టలో బుల్లెట్ దిగిబడి బయటకు వచ్చింది. ఆమె పక్కనున్న మనుమడు కళ్యాణ్‌కు తీవ్ర గాయాలుకాగా గ్రామస్తుడు నాగూర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రక్తమోడుతున్న తిరుమలమ్మను వైద్యశాలకు తరలించేందుకు రోడ్డుపైకి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె మృతి చెందింది. మిగిలిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. -
ఎమ్మెల్యే చెవిరెడ్డికి గాయాలు
తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం పాకాల మండలం బయనపల్లెలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కారులో బయలుదేరారు. బయనపల్లె సమీపంలో అడ్డొచ్చిన అడవిజంతువు వీరి వాహనం ఢీకొని అదుపు తప్పిన ఎదురుగా వస్తున్న కర్ణాటక వాసుల వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కర్ణాటక వాసుల వాహనం పల్టీ కొట్టడంతో అందులోని ఏడుగురికి గాయాలయ్యాయి. యపడిన కర్ణాటక వాసులను ఎమ్మెల్యే చెవిరెడ్డి తమ సొంత వాహనంతో పాటు 108 అంబులెన్స్‌లో చిత్తూరు ఆసుపత్రికి పంపించారు. అనంతరం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని తరువాత చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్ణాటక వాసులను ఎమ్మెల్యే చెవిరెడ్డి పరామర్శించారు. వారి వైద్య ఖర్చులను ఆయనే చెల్లించారు.