minor sisters
-
దారుణం : ముగ్గురు అక్కాచెలెళ్లపై యాసిడ్ దాడి
లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన గోండాలో వెలుగుచూసింది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్ బాలికలైన అక్కాచెల్లెళ్లలో ఇద్దరికి కాలిన గాయాలు కాగా, మరొక బాలికకు ముఖంపై గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ గోండా పోలీసులు ఎవరినీ అరెస్ట చేయలేదు. బాధితులను వరుసగా 8, 12, 17 సంవత్సరాల వయసు కలిగిన బాలికలుగా గుర్తించారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కాగా, హత్రాస్‌లో దళిత యువతి హత్యాచార ఘటన కలకలం రేపిన నేపథ్యంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సెప్టెంబర్ 14న యువతి పంటపొలంలో పనిచేసుకుంటుండగా నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో బాధితరాలు ఢిల్లీలోని సఫ్ధర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 29న ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. మరోవైపు హత్రాస్ కేసు దర్యాప్తునకు సంబంధించి కేరళకు చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన నలుగురు కార్యకర్తలను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమైంది. చదవండి : పెళ్లి చేసుకోకుంటే యాసిడ్ పోసి చంపేస్తా.. -
మైనర్ అక్కా చెల్లెళ్లపై సామూహిక అత్యాచారం!
మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై వాళ్ల ఇంటి యజమాని, మరో ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం గుర్గావ్లోని బినోలా గ్రామంలో జరిగింది. 13, 16 సంవత్సరాల వయసున్న ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు నెల రోజుల క్రితమే మధ్యప్రదేశ్ నుంచి తమ తల్లి, సోదరుడితో కలిసి పని వెతుక్కోడానికి గుర్గావ్ ప్రాంతానికి వచ్చారు. వాళ్లు బినోలా గ్రామంలో రామావతార్ (50) అనే వ్యక్తికి చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నారు. శనివారం రాత్రి నలుగురు నిందితులు పూటుగా మద్యం తాగి, వాళ్ల ఇంటికి వచ్చారు. ముందుగా తల్లి, సోదరుడిపై దాడిచేసి, వాళ్లను కొట్టి ఓ గదిలో పెట్టి బంధించారు. తర్వాత ఆడపిల్లలిద్దరినీ గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ ఒకరి తర్వాత ఒకరుగా పదే పదే అత్యాచారం చేశారు. తాము ఆ ఇంటికి వచ్చినప్పటినుంచే తన కూతుళ్లపై ఇంటి యజమాని కళ్లు పడ్డాయని బాధితుల తల్లి వాపోయింది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. బాధితులకు వైద్యపరీక్షలు జరిపేందుకు ప్రత్యేకంగా వైద్యుల బృందాన్ని ఏర్పాటుచేశారు. నిందితులు రామావతార్, రామ్ కిషన్ (30), మంతోష్, ఓంబీర్ (22)లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఇల్లు ఖాళీ చేయమని చెప్పినందుకే తమపై ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిందితులు విచారణలో చెప్పారు.