మైనారిటీ సంస్థలకు ఆర్టీఈ వర్తించదు
* సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ
* 2010 నాటి త్రిసభ్య బెంచ్ తీర్పు సరికాదు
* అలాగైతే మైనారిటీ పాఠశాలల రాజ్యాంగపరమైన హక్కు రద్దవుతుంది
న్యూఢిల్లీ: ఉచిత, నిర్బంధ విద్యా చట్టం మేరకు చిన్నారులకు సంక్రమించిన హక్కు (ఆర్టీఈ) మైనారిటీ విద్యా సంస్థలకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ సంస్థల విషయంలో ఈ హక్కు రాజ్యాంగ విరుద్ధమైనదిగా, సంస్థలకున్న హక్కును హరించేదిగా సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆర్టీఈ చట్ట ప్రకారం.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్ని పాఠశాలల్లోనూ 25% సీట్లకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. అరుుతే 2009 నాటి ఈ చట్టం ఎరుుడెడ్ మైనారిటీ పాఠశాలలకూ వర్తిస్తుందని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం 2010లో ఇచ్చిన తీర్పు సరి కాదని ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం పేర్కొంది. రాజ్యాంగానికి సంబంధించిన ప్రాథమిక స్వరూపాన్ని లేదా నిర్మాణాన్ని.. అధికరణం 21ఏ (విద్యాహక్కు), అధికరణం 15(5) (ఆర్థికంగా బలహీనవర్గాలకు సంబంధించినది)లు మార్చలేవని, అవి రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటయ్యే అధికరణాలని విస్తృత ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇదే సమయంలో 2009 నాటి విద్యా హక్కు చట్టం రాజ్యాంగంలోని అధికరణం 19(1)(జీ) (వాక్ స్వాతంత్య్రానికి సంబంధించినది)కి విరుద్ధం కాదని బెంచ్ అభిప్రాయపడింది. అరుుతే రాజ్యాంగంలోని అధికరణం 30, క్లాజ్ 1 (మైనారిటీల హక్కులు) పరిధిలోకి వచ్చే ఎరుుడెడ్ లేదా అన్ ఎరుుడెడ్ మైనారిటీ పాఠశాలలకు సంబంధించినంత వరకు ఆర్టీఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమేనని తాము భావిస్తున్నట్టు విస్తృత ధర్మాసనం పేర్కొంది. మైనారిటీ పాఠశాలలకు ఈ చట్టాన్ని వర్తింపజేస్తే రాజ్యాంగం ప్రకారం వారికున్న హక్కు రద్దవుతుందని పేర్కొంది. ఆర్టీఈ చట్టాన్ని ఎరుుడెడ్ మైనారిటీ స్కూళ్లకు వర్తింపజేయడం సరికాదని కోర్టు మెజారిటీ తీర్పు అభిప్రాయపడినట్టు 2010 నాటి తీర్పును ప్రస్తావిస్తూ ధర్మాసనం తెలిపింది.
ప్రభుత్వ సంస్థలూ ఉత్తమ విద్యార్థులను తయూరు చేస్తున్నాయ్..
అధికరణం 15 (5).. ప్రాథమిక హక్కుకు, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందన్న మైనారిటీయేతర ప్రైవేట్ అన్ ఎరుుడెడ్ విద్యాసంస్థల వాదనను బెంచ్ తోసిపుచ్చింది. వెనకబడిన తరగతులకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లలో ఆయూ విద్యార్థులను చేర్చుకుంటున్న ఐఐటీలు, ఏఐఐఎంఎస్, ప్రభుత్వ వైద్య కళాశాలలు, కేంద్రీయ విద్యాలయూల వంటి ప్రభుత్వ విద్యా సంస్థలు సైతం అపారమైన ప్రతిభా పాటవాలు కలిగిన విద్యార్థులను తయూరు చేయగలిగాయంది. వారు మంచి పాలకులుగా, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లుగా ఎదగగలిగారని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పెపైచ్చు ఈ వర్గాలకు సీట్లివ్వడం వల్ల ఉత్తమతతో రాజీపడాల్సి వస్తోందనే ప్రైవేటు విద్యా సంస్థల అభిప్రాయం.. పౌరులంద రి సౌభ్రాతృత్వ పరిరక్షణకు, వ్యక్తుల గౌరవానికి, దేశ సమగ్రతలకు హామీ ఇస్తున్న రాజ్యాంగ ప్రవేశికకే విరుద్ధమని పేర్కొంది. మైనారిటీయేతర ప్రైవేట్ అన్ ఎరుుడెడ్ సంస్థలు వేసిన పిటిషన్ను కొట్టివేసింది.