మైనార్టీ విచారణ కమిషన్ వెబ్సైట్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ‘మైనార్టీస్ విచారణ కమిషన్’కు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ను బుధవారం సచివాలయంలో రాష్ర్ట మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రారంభించారు. ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ వర్తింప చేయడానికిగాను వారి సామాజిక, ఆర్థిక , విద్యాపరమైన స్థితిగతుల అధ్యయనానికి ప్రభుత్వం ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది.
ముస్లింల స్థితిగతులపై లోతైన అధ్యయనం కోసం సలహాలు, సూచనలు వెబ్సైట్ http://coiformuslims.telangana.gov.in లో అందించవచ్చని చెప్పారు. ప్రజల సలహాలు, సూచనలు సైతం పరిగణలోకి తీసుకొని వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేస్తామని చెప్పారు.