మైనార్టీలకు ఎస్సై మెయిన్స్‌కు ఉచిత శిక్షణ
హైదరాబాద్ : తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మెయిన్స్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ నీరజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన మైనార్టీ అభ్యర్ధులు ఉచిత శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్ధులు ఈ నెల 20 లోగా వెబ్సైట్ www.msc.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.