దుమ్మురేపుతున్న పవన్ లేటెస్ట్ సాంగ్
హైదరాబాద్: మెగా హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ 'కాటమరాయుడు' మూవీ ప్రమోషన్లో భాగంగా 'మిరా మిరా మీసం.. మెలి తిప్పాడు జనం కోసం' అనే పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. పవన్ కల్యాణ్ ముందుగానే చెప్పినట్లుగానే శుక్రవారం సాయంత్రం సాంగ్ ఆడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాట కొన్ని నిమిషాల్లోనే భారీ వ్యూస్ తో దుమ్మురేపుతోంది. నేటి నుంచి మూడు రోజులకో పాట చొప్పున పాటలను రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసింది.
పాటల షూటింగ్ కోసం కాటమరాయుడు టీమ్ యూరప్ వెళ్లనుంది. అక్కడి నుంచి తిరిగొచ్చాక.. ఈ 18న భారీ ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్, శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ (కిశోర్ పార్థసాని) దర్శకుడు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తుండగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శరత్ మరార్ మూవీని నిర్మిస్తున్నాడు.