మిర్చి రైతుల ఆందోళన
మలక్‌పేట వ్యవసాయ మార్కెట్లో ఫర్నిచర్ ధ్వంసం
హైదరాబాద్: రాజధానిలోని మలక్‌పేట వ్యవసాయ మార్కెట్లో గురువారం రైతులు, వ్యాపారులు, కమీషన్‌దార్లు మిర్చిఆన్లైన్ (ఇనామ్) కొనుగోలు పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందు అకస్మాత్తుగా ఆందోళనకు దిగారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ పి.రవికుమార్ చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుల్తాన్‌బజార్ ఏసీపీ చక్రవర్తి ఆధ్వర్యంలో ఆందోళనకారులను చెదరగొట్టారు.
రవికుమార్ మాట్లాడుతూ.. ఏడు నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇనామ్ ద్వారా మిర్చి కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇది వ్యాపారులు, కమీషన్‌దారులకు మిం గుడుపడటం లేదన్నారు. అందుకే కొందరు కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్లు... గుమ స్తాలు, రైతులను ఉసిగొల్పి ఆందోళన చేరుుంచారన్నారు. రైతులను రెచ్చగొట్టిన వారిపై కేసులు నమోదు చేరుుస్తామని ఎస్జీఎస్ రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. బాధ్యులైన గుమస్తాలు, కమీషన్దార్ల లెసైన్‌సలను రద్దు చేస్తామన్నారు.
‘మిర్చి అసోసియేషన్‌కు సంబంధం లేదు’...
మలక్‌పేట వ్యవసాయ మార్కెట్లో జరిగిన గొడవ మిర్చి వ్యాపారులకు సంబంధం లేదని తెలంగాణ మిర్చి అసోసియేషన్ అధ్యక్షుడు వంజరి వినోద్ స్పష్టం చేశారు. అమ్మకాలలో రైతులకు జరుగుతున్న జాప్యంతో ఆందోళనకు దిగారు తప్ప అసోసియేషన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.