మిర్యాలగూడ నియోజకవర్గం గెలిచిన అభ్యర్థులు వీరే...
మిర్యాలగూడ నియోజకవర్గం
మిర్యాలగూడ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మరోసారిగెలిచారు. ఆయన 2014లో కాంగ్రెస్ ఐ టిక్కెట్‌పై విజయం సాదించి, తదుపరి పరిణామాలలో టిఆర్ఎస్ లో చేరిపోయారు.2018లో టిఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీచేసి 30652 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భాస్కరరావు తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్యను ఓడిరచారు.
2014లో కృష్ణయ్య ఎల్బినగర్ నుంచి టిడిపి టిక్కెట్‌పై గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల ముందు ఆయన అనూహ్యంగా కాంగ్రెస్ ఐలో చేరి మిర్యాలగూడ టిక్కెట్ పొంది పోటీచేసినా పలితం దక్కలేదు. భాస్కరరావుకు 83931 ఓట్లు రాగా, ఆర్.కృష్ణయ్యకు 53279 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్దిగా పోటీచేసిన స్కైలాబ్ నాయక్‌కు దాదాపు పద్నాలుగు వేల ఓట్లు వచ్చాయి. నల్లమోతు భాస్కరరావు కమ్మ సామాజికవర్గం నేత.
సిపిఎం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడలో మూడుసార్లు గెలిచారు. మిర్యాలగూడలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, సిపిఎం ఐదుసార్లు గెలవగా, ఒకసారి పిడిఎఫ్, ఒకసారి టిఆర్ఎస్ గెలిచాయి. మరో నేత తిప్పన చినకృష్ణారెడ్డి ఇక్కడ నుండి మూడుసార్లు గెలిస్తే, ప్రముఖ కాంగ్రెస్ నేత చకిలం శ్రీనివాసరావు ఇక్కడ ఒకసారి, నల్గొండ నుంచి రెండుసార్లు విజయం సాధించారు. చకిలం ఒకసారి లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు.
చినకృష్ణారెడ్డి, 1989లో గెలిచిన విజయసింహారెడ్డి తండ్రి, కుమారులు 2004లో ఇక్కడ టిడిపి పక్షాన పోటీచేసిన మాజీ పోలీసు అధికారి పి. చంద్రశేఖరరెడ్డి, ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరారు. 2009లో సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి ఒక్కసారి కూడా గెలుపొందలేదు. అయితే టిడిపి మిత్రపక్షంగా సిపిఎం గెలుపొందింది. మిర్యాలగూడలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గం, నాలుగుసార్లు కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, ఒక్కొక్కసారి గెలిచారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..