Hyderabad: త్వరలో.. ‘మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్’ 2024– సీజన్ 1..
సాక్షి, సిటీబ్యూరో: అందమైన వేడుకకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. మగువలకు ఈ వేడుక ‘స్ట్రాంగ్’మెసేజ్ ఇవ్వనుంది. మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ 2024– సీజన్ 1 జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి నిర్వహించనున్న ఈ బ్యూటీ పేజెంట్ ఆడిషన్స్ అక్టోబర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ కర్టెన్ రైజర్‌ను వ్యవస్థాపక నిర్వాహకులు కిరణ్మయి అలివేలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఔత్సాహిక వనితల నిత్యజీవితంలోని ఆలోచనలు, ఆశయాలకు పెళ్లి ముగింపు కాదు, మరో అద్భుత ఆరంభమని అన్నారు. మగువల సౌందర్యాన్ని మరింత గ్రాండ్‌గా ప్రదర్శించడానికి ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆడిషన్స్‌లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు www.sbtribe.org లేదా https://sbtribe.org/ వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోడల్స్, యువతులతోపాటు ఔత్సాహిక వివాహితలతో నిర్వహించిన ఫ్యాషన్ వాక్ విశేషంగా అలరించింది.