Hyderabad: త్వరలో.. ‘మిస్‌ అండ్‌ మిసెస్‌ స్ట్రాంగ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌’ 2024– సీజన్‌ 1.. | Miss and Mrs Strong And Beautiful 2024 Season 1 Compitition In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: త్వరలో.. ‘మిస్‌ అండ్‌ మిసెస్‌ స్ట్రాంగ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌’ 2024– సీజన్‌ 1..

Published Tue, Aug 20 2024 1:13 PM | Last Updated on Tue, Aug 20 2024 1:13 PM

Miss and Mrs Strong And Beautiful 2024 Season 1 Compitition In Hyderabad

అక్టోబర్‌లో ప్రతిష్టాత్మక బ్యూటీ పేజెంట్‌ ఆడిషన్స్‌ ప్రారంభం

పోస్టర్‌ ఆవిష్కరించిన నిర్వాహకురాలు కిరణ్మయి

సాక్షి, సిటీబ్యూరో: అందమైన వేడుకకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. మగువలకు ఈ వేడుక ‘స్ట్రాంగ్‌’మెసేజ్‌ ఇవ్వనుంది. మిస్‌ అండ్‌ మిసెస్‌ స్ట్రాంగ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ 2024– సీజన్‌ 1 జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కలిపి నిర్వహించనున్న ఈ బ్యూటీ పేజెంట్‌ ఆడిషన్స్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మిస్‌ అండ్‌ మిసెస్‌ స్ట్రాంగ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ కర్టెన్‌ రైజర్‌ను వ్యవస్థాపక నిర్వాహకులు కిరణ్మయి అలివేలు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఔత్సాహిక వనితల నిత్యజీవితంలోని ఆలోచనలు, ఆశయాలకు పెళ్లి ముగింపు కాదు, మరో అద్భుత ఆరంభమని అన్నారు. మగువల సౌందర్యాన్ని మరింత గ్రాండ్‌గా ప్రదర్శించడానికి ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆడిషన్స్‌లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు www.sbtribe.org లేదా https://sbtribe.org/ వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోడల్స్, యువతులతోపాటు ఔత్సాహిక వివాహితలతో నిర్వహించిన ఫ్యాషన్‌ వాక్‌ విశేషంగా అలరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement