మిస్ వరల్డ్ కిరీటం తృటిలో మిస్
మేరీల్యాండ్: మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత్‌కు చెందిన ప్రియదర్శిని చటర్జీ తృటిలో కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా 116 మంది పాల్గొన్న ఈ పోటీల్లో ప్రియదర్శిని టాప్ 20 వరకు చేరినా, టాప్ 5లో చోటు సంపాదించలేకపోయారు. మిస్ వరల్డ్ 2016 కిరీటాన్ని 19 ఏళ్ల పోర్టా రికో సుందరి స్టిఫానీ డెట్ వాల్లె గెలుచుకున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిర్వహించిన ఫైనల్ పోటీల్లో కెన్యా, ఇండోనేషియా, డొమీనికన్ రిపబ్లిక్, ఫిలిప్పైన్స్కు చెందిన సుందరీమణులను దాటుకొని విజేతగా స్టిఫానీ డెట్ వాల్లె నిలిచింది.
కాగా, భారత్ తరపున చివరిసారిగా ప్రయాంకచోప్రా(2000) మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. అంతకు ముందు రీతా ఫారియా(1996), ఐశ్వర్యారాయ్(1994), డయానా హెడెన్(1997) యుక్తా ముఖి(1999)లు మిస్ వరల్డ్ కిరిటాన్ని దక్కించుకున్న వారిలో ఉన్నారు.
ప్రియదర్శిని చటర్జీ