రెండో రోజు నామినేషన్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండోరోజు శుక్రవా రం జిల్లాలో ఎమ్మెల్యే స్థానాలకు మూడు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. పార్లమెంట్ స్థానానికి ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. నిజామాబాద్ అర్బన్ నుంచి సీపీఎం తరపున సబ్బని లత నామినేషన్ వేసేందుకు రాగా సమయం మించి పోవడంతో అధికారులు నామినేషన్ స్వీకరించలేదు.
అసెంబ్లీ స్థా నానికి నామినేషన్ వేయడానికి మధ్యాహ్నం 3 దాటితే అధికారు లు స్వీకరించరు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ముత్యాల సునీల్‌కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. బాన్సువాడ నుంచి సీపీఎం అభ్యర్థి నూర్జహాన్ నామినేషన్ వేశారు.
శుక్రవారం నాటికి జల్లా మొత్తంగా అసెంబ్లీ స్థానాలకు 5 నామినేషన్లుదాఖలయ్యాయి. బాన్సువాడ సీపీఎం అభ్యర్థిని నూర్జహాన్ సాదాసీదాగా తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి ఒక సెట్ నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏజేసీ డాక్టర్ శేషాద్రికి అందజేశారు. ఆమె వెంట సీపీఎం నాయకులు రవీందర్ ఉన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే స్థానానికి రెండు రోజుల్లో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.