సమైక్యాంధ్ర కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ యోచన
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రతిపాదనను విరమించుకోకపోతే సమైక్యాంధ్ర కాంగ్రెస్ పేరుతో సీమాంధ్రలో కొత్త పార్టీ రావొచ్చని రాజమండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు చెప్పారు.15 రోజుల్లో కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత రావచ్చని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచిన ఘనత ఇందిరా గాంధీదేనన్నారు.
విభజన నిర్ణయంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చించకపోవడం తప్పిదమేనన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని ఆయన కోరారు. రాజకీయ లబ్ది కోసమే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిందని బావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. Thinking on New Party Samaikyandhra Congress