లొల్లి తగ్గాలంటే ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలి:ఎమ్మెల్సీ దిలీప్
కరీంనగర్: రాష్ట్రంలో లొల్లి తగ్గాలంటే ప్రభుత్వాన్ని భర్తరప్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణా ఇవ్వాలని ఆయన కోరారు. లేకుంటే లక్ష మంది సైన్యంతో అసెంబ్లీని, పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి సీమాంద్రకే సీఎం అయినట్లు వ్యవహరిస్తూ, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. సామాజిక తెలంగాణా రాష్ట్ర సాధన కోసం తెలంణా యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో లక్ష మంది సైన్యాన్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో సైన్యం రిక్రూట్ మెంట్ ప్రారంభించామని చెప్పారు. త్వరలో అన్ని జిల్లాల్లో సైన్యం ఎంపిక పూర్తి చేస్తామన్నారు.
హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే లక్ష మంది సైన్యంతో అసెంబ్లీని, పార్లమెంట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. సీమాంధ్ర లాబింగ్లతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ఆటంకం కల్పిస్తే తీవ్ర పరిణామాలుంటాయని దిలీప్ కుమార్ హెచ్చరించారు.