సెక్స్ వర్కర్ల ధర్నా
బెంగళూరు(బనశంకరి) :
ప్రభుత్వానికి ఎమ్మెల్సీ జయమాల అందించిన నివేదికను వ్యతిరేకిస్తూ కర్ణాటక సెక్స్‌వర్కర్లు శనివారంటౌన్హాల్ వద్ద ధర్నాకు దిగారు. ఆందోళనకారులు మాట్లాడుతూ ప్రభుత్వానికి అందించిన నివేదికలో సెక్స్వర్కర్లును కించపరిచే అంశాలున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం జయమాల నివేదికను అమలు చేయరాదని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.