పీఆర్సీపై సీఎం కేసీఆర్‌ను కలసిన పీఆర్టీయూ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు పదో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని పీఆర్టీయూ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 63 శాతం ఫిట్మెంట్తో 2013 జులై నుంచి వేతన సవరణ వర్తింపజేయాలని కోరారు.
శుక్రవారం సచివాలయంలో ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డిలతో పాటు పీఆర్టీయూ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సరోత్తమ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని, నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరుకు హామీ ఇచ్చారని తెలిపారు.