చిల్లర్ యాప్ తో చేయి కలిపిన ఆంధ్రాబ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫోన్‌బుక్‌లో ఉన్న నెంబర్‌కి ఎప్పుడైనా నగదు బదిలీ చేసుకునే సదుపాయాన్ని ఆంధ్రాబ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం మొబైల్ పేమెంట్ యాప్ చిల్లర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఖాతాదారుని అకౌంట్‌తో చిల్లర్ యాప్ అనుసంధానింపబడి ఉంటుందని, దీంతో దేశంలో ఎక్కడికైనా తక్షణం నగదును పంపిచుకోవచ్చని ఆంధ్రాబ్యాంక్ జనరల్ మేనేజర్ ఎం.ఎన్.సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం ఇది పెలైట్ ప్రాజెక్టు కింద బ్యాంకు ఉద్యోగులపై పరీక్షిస్తున్నామని, త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.