100 మోడల్ జంక్షన్లు
థర్డ్‌రాక్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నివేదికల మేరకు సుచిత్ర, ఐడీపీఎస్ జంక్షన్ల అభివృద్ధికి టెండర్ ప్రక్రియ జరుగుతోంది. థర్డ్‌రాక్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నివేదికల మేరకు సుచిత్ర, ఐడీపీఎస్ జంక్షన్ల అభివృద్ధికి టెండర్ ప్రక్రియ జరుగుతోంది. లీ అసోసియేట్స్ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ నివేదిక అనుగుణంగా సిటీ కాలేజీ జంక్షన్ టెండర్ పూర్తయింది.
సిటీబ్యూరో: సిటీలోని ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధిపై దృష్టి సారించిన అధికారులు.. ఇందులో పాదచారుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో నాలుగు రకాల జంక్షన్లు ఉన్నాయి. వీటిలో నాలుగు కంటే ఎక్కువ రహదారులు వచ్చి కలిసే జంక్షన్లు, నాలుగు రోడ్ల కూడళ్లు, చౌరస్తాలు, మూడు రోడ్లతో కూడిన ‘టి’, ‘వై’ జంక్షన్లు. ఇలా ప్రతి జంక్షన్‌లోనూ పాదచారులు రోడ్డు దాటేందుకు కచ్చితంగా ప్రత్యేక మార్కింగ్స్ ఏర్పాటు చేయనున్నారు. రెడ్ సిగ్నల్ పడే వరకు చౌరస్తాలో వేచి ఉండేందుకు రోడ్డు పక్కన సౌకర్యవంతమైన ప్లాట్‌ఫామ్స్ నిర్మించాలని నిర్ణయించారు. జంక్షన్లలో సైతం పాదచారులు ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటేందుకు ప్రయత్నించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి విరుగుడుగా రెయిలింగ్స్ ఏర్పాటు చేస్తారు.
జంక్షన్ స్థాయిని బట్టి అన్ని రోడ్లలో ఎడమ వైపు ఫుట్‌పాత్‌ను అనుసరించి కనిష్టంగా 100 మీటర్ల నుంచి గరిష్టంగా 200 మీటర్ల వరకు రెయిలింగ్స్ నిర్మిస్తారు. రోడ్ క్రాసింగ్ మార్కింగ్స్ ఉన్న ప్రాంతంలో వీటికి ఓపెనింగ్ ఇస్తారు. ఫలితంగా పాదచారులు ఆ ప్రాంతంలో మాత్రమే రహదారిని దాటేందుకు అవకాశం ఉంటుంది. అంధులు రోడ్డు దాటే సమయంలో ఆ విషయం వాహనదారులకు స్పష్టంగా తెలిసేలా ‘హూటర్లు’ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక శబ్దం చేసే ఈ హూటర్ సదరు పాదచారుడు రోడ్డు దాటే వరకు మోగుతూనే ఉంటుంది.
ఫ్రీగా ‘ఫ్రీ లెఫ్ట్’...
సిటీ వ్యాప్తంగా మోడల్ జంక్షన్ల అమలుకు దాదాపు ప్రతి జంక్షన్‌లోనూ ‘ఫ్రీ లెఫ్ట్’ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఏదైనా జంక్షన్లో రెడ్ సిగ్నల్ పడినప్పుడు నేరుగా వెళ్లేందుకు ఆగుతున్న వాహనాల కారణంగా.. ఎడమ వైపు వెళ్లే వాహనాలూ ఆగిపోవాల్సి వస్తోంది. దీనికోసం ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ‘ఫ్రీ లెఫ్ట్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే కొన్ని జంక్షన్ల విస్తీర్ణం తక్కువగా ఉండడంతో ఈ విధానం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. మోడల్ జంక్షన్ల ఏర్పాటులో భాగంగా ‘ఫ్రీ లెఫ్ట్’కు అనుగుణంగా జంక్షన్ల విస్తరణకు భూసేకరణ చేయాలని భావిస్తున్నారు.
పీక్, నాన్–పీక్ అవర్స్‌ల్లో వివిధ జంక్షన్లలో ట్రాఫిక్ జామ్స్, రెడ్, గ్రీన్ సిగ్నల్స్‌కు మధ్యలో 100 మీటర్ల పరిధిలో నిలిచిపోతున్న వాహనాలు పరిపాటిగా మారాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ట్రాఫిక్ అధికారులు అనేక జంక్షన్లను మూసేశారు. ఉప్పల్, హబ్సిగూడ, కేసీపీ తదితర ఈ కోవలోకే వస్తాయి. ఆయా జంక్షన్ల నుంచి నేరుగా వెళ్లాల్సిన వాహనాలను ఎడమ వైపు కొద్దిదూరం మళ్లిస్తున్నారు. అక్కడ యూటర్న్ ఇవ్వడం ద్వారా వాహనం మళ్లీ జంక్షన్ వద్దకు చేరుకొని ఎడమ వైపు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. సిటీలోని అనేక ప్రాంతాల్లో ఈ యూటరŠన్స్ ఇరుకుగా ఉండడంతో బస్సులతో పాటు కొన్ని పెద్ద వాహనాలకూ ఇబ్బందిగా మారింది. దీంతో ‘టర్న్’ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ‘యూటరŠన్స్’ను విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.