ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య
బంజారాహిల్స్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నంగరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెం. 10 లోని జహిరానగర్‌లో నివసించే మహ్మద్ సల్మాన్ (22) సమీపంలోని సిటీ సెంటర్ మాల్లో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. గత కొంత కాలం నుంచి స్థానికంగా నివసిస్తున్న ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.
అయితే వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో మనస్తాపం చెందిన సల్మాన్ బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విఫలమవడం వల్లనే తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరి రేహం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.