భారత మహిళల బాక్సింగ్ కోచ్‌గా ఖమర్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించిన కోల్‌కతా బాక్సర్ అలీఖమర్... జాతీయ మహిళల జట్టు చీఫ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి అలీఖమర్ను కోచ్‌గా నియమిస్తున్నట్లు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ప్రకటించింది. ప్రస్తుత కోచ్ శివ్ సింగ్ స్థానంలో అలీ ఖమర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. 2002 మాంచెస్టర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లైట్ ఫ్లయ్ వెయిట్ కేటగిరీలో అలీ ఖమర్ స్వర్ణాన్ని గెలిచి చరిత్ర సృష్టించాడు.
ఇతనికి జాతీయ బాక్సింగ్ క్యాంపులో అసిస్టెంట్ కోచ్‌గా ఏడాదికి పైగా పనిచేసిన అనుభవముంది. రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ మహిళల జట్టుకు మూడేళ్ల పాటు తన సేవలందించాడు. అర్జున అవార్డు గ్రహీత అయిన అలీఖమర్... 38 ఏళ్ల వయస్సులోనే భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటివరకు ఈ పని చేసిన వారిలో ఇతనే పిన్న వయస్కుడు. గతంలో కోచ్‌లుగా పనిచేసిన అనూప్ కుమార్, గుర్బక్ష్ సింగ్ సంధు 50 ఏళ్ల పైబడిన తరువాతే ఈ బాధ్యతలు స్వీకరించారు.