బ్యానర్లో ఫొటో పెట్టలేదని ఆడీ కారు ధ్వంసం
రూ.15 లక్షలు ఎత్తుకెళ్లిన వైనం
బంజారాహిల్స్: బ్యానర్లో ఫొటో పెట్టలేదంటూ ఆడికారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసి యజమానిని తీవ్రంగా గాయపర్చిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.12 సయ్యద్‌నగర్ ఫస్ట్‌లాన్సర్ చిల్లా సమీపంలో ఉన్న షాహిన్ హోటల్ వద్ద అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాలిద్ షరీఫ్ కొత్తగా కొనుగోలు చేసిన ఆడి కారులో వెళ్తూ పాన్‌షాప్ వద్ద ఆగాడు. డ్రైవర్ పాన్ తీసుకొని వచ్చేలోగానే అదేప్రాంతంలో నివసించే సాదిఖ్ అనే వ్యక్తితో పాటు ఆయన కొడుకు, భార్య, మరో 150 మంది కలిసి ఒక్కసారిగా ఖాలిద్ షరీఫ్ కూర్చున్న ఆడికారు వద్దకు వచ్చారు. బ్యానర్లో తన పేరు ఎందుకు చేర్చలేదంటూ అరుస్తూ దాడికి పాల్పడ్డాడు కారును ధ్వంసం చేశాడు.
దీంతో స్థానికంగా ఉధ్రిక్తత నెలకొంది. రూ.60 లక్షల విలువచేసే కారును పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా పెట్రోల్‌బంక్‌లో ఆ రోజు కలెక్షన్ రూ.15 లక్షలు కూడా లాక్కున్నారని ఆరోపించారు. తాను రూ.15 లక్షలను బ్యాంకులో జమ చేసేందుకు తీసుకెళ్తున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడి చేసి కారును ధ్వంసం చేసి రూ.15 లక్షలు ఎత్తుకెళ్లిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ షరీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు సాదిఖ్‌తో పాటు ఆయన భార్యపై ఐపీసీ సెక్షన్ 448, 427 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.