mohan sharma
-
ఆమె మాటలకు షాకయ్యా.. అంతా ఆ రోజు రాత్రే: నటి మాజీ భర్త షాకింగ్ కామెంట్స్
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటి లక్ష్మి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు హీరోయిన్గా దక్షిణాది సినిమాల్లో మెప్పించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆమె హీరోయిన్గా నటించిన పలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ తనదైన నటనతో మెప్పించారు. అయితే ఆమె నటనతో పాటు తన వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె మాజీ భర్త, తమిళ నటుడు మోహన్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. లక్ష్మి, మోహన్ శర్మ జంటగా చాలా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారి.. 1975లో వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన ఐదేళ్లకే భేదాభిప్రాయాలు రావడంతో 1980లోనే విడిపోయారు. తాజా ఇంటర్వ్యూలో లక్ష్మి తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకుంటే జీవితాంతం కుక్కలా నీ వెంటే ఉంటానని తనతో చెప్పిందని మోహన్ శర్మ వెల్లడించారు. మోహన్ శర్మ మాట్లాడుతూ.. 'ఓసారి నేను, లక్ష్మి షాప్‌కు వెళ్లాం. అక్కడ ఒక సెంట్ కొనాలని చెప్పా. అప్పట్లో దాని ధర రూ.500. జీవితంలోకి ఆహ్వానిస్తే.. నీ కుక్కలా ఉంటానని లక్ష్మి నన్ను అడిగింది. ఆ మాటలకు నేను షాకయ్యా. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. తొలిసారి ఓ అమ్మాయి తన ప్రేమను వ్యక్తం చేసింది. ఆ సమయంలో లక్ష్మి మాటలను సీరియస్‌గా తీసుకున్నా. ఆ తర్వాత కాల్ చేసి తన రూమ్‌కు రమ్మని పిలిచింది. నేను వెంటనే హోటల్‌కు వెళ్లా. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగింది. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నానని.. పెళ్లి గురించి ఆలోచనే లేదని చెప్పా. కానీ.. పెళ్లి చేసుకోవాలని లక్ష్మి అడిగాక నేను ఆమె నుదుటన కుంకుమ పెట్టా. తాను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చా. ఆ రాత్రే మేం భార్యభర్తలం అయ్యాం. ఆ తర్వాత మేం చెన్నైకి వచ్చి లాయర్ ద్వారా మా పెళ్లి విషయాన్ని మీడియాకు తెలియజేశాం' అని చెప్పారు. పెళ్లి తర్వాత మాకు కలిసే అవకాశం చాలా తక్కువగా ఉండేదని మోహన్ శర్మ తెలిపారు. అయితే లక్ష్మి చాలా తప్పులు చేశారని.. వాటన్నింటి గురించి తాను ఇప్పుడు చెప్పలేనని అన్నారు. ఆమె తన జీవితంలోకి మరో వ్యక్తిని రానిచ్చారని ఆరోపించారు. కూతురు ఐశ్వర్య, లక్ష్మి మధ్య తరచూ గొడవలు కూడా అయ్యేవని ఆయన వెల్లడించారు. కాగా.. 1980లో మోహన్‌తో విడాకులు తీసుకున్న లక్ష్మి.. ఆ తర్వాత దర్శకుడు శివచంద్రన్ను పెళ్లి చేసుకున్నారు. -
నమ్మ గ్రామానికి ‘అమ్మ’ అభినందన
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : రెండు జాతీయ అవార్డులతోపాటు సీఎం జయలలిత అభినందనలను అందుకున్న చిత్రం నమ్మ గ్రామం. కుల మతాల జాఢ్యం, మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ఇంతకుముందు పలు చిత్రాలు వచ్చినా వాటికి భిన్నంగా యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం నమ్మ గ్రామం అని ఆ చిత్ర దర్శకుడు మోహన్‌శర్మ తెలిపారు. తమిళం, తెలుగు, మలయా ళం, కన్నడం భాషల్లో 17కు పైగా చిత్రాల్లో వివిధ తరహా పాత్రలు పోషించి గుర్తింపు పొందిన ఈయన నిర్మాతగా 17 చిత్రాలు నిర్మించారు. 2002లో దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన మోహన్‌శర్మ తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం నమ్మ గ్రామం. దర్శకుడు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ఒక మంచి చిత్రాన్ని తెరకెక్కించాలని భావించానన్నారు. సుమారు 100 ఏళ్ల క్రితం జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా నమ్మ గ్రామం చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. జాతి జాఢ్యం ఎంతగా పెరిగిపోయింది, దాని పరిణామాలేమిటి? అనే అంశాలను సహజసిద్ధంగా తెరకెక్కించినట్లు తెలిపారు. ఇందులో నిషాంత్, సమృతతోపాటు సుకుమారి, వై.జి.మహేంద్రన్, ఫాతిమాబాబు, నళిని నట్టించారని, తాను కూడా నటించినట్లు చెప్పారు. నమ్మ గ్రామం చిత్రంలో నటించిన సుకుమారి ఉత్తమ సహాయ నటిగాను, ఇందిరన్ జమున ఉత్తమ కాస్ట్యూమర్గాను, 2012లో జాతీయ అవార్డులను అందుకున్నారని, ముఖ్యమంత్రి జయలలిత చిత్రం చూసి చాలా మంచి చిత్రం అంటూ అభినందించారని దర్శకుడు తెలిపారు. గుణచిత్ర పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని జనవరి 3న విడుదల చేయనున్నట్లు తెలిపారు.