సరి కొత్తగా...
సైనికుడు సైన్యంలో ఉండాలి... సగటు మనిషి సంఘంలో ఉండాలి అనే వైవిధ్యమైన ఇతివృత్తంతో ఓ చిత్రం రూపొందనుంది. తనీష్, మోహిత జంటగా శ్రీ చీర్ల మూవీస్ పతాకంపై శ్రీనివాసయాదవ్ నిర్మించనున్న చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. సంజీవ్ మేగోటి దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి శిరీష, మేగోటి ఉమామహేశ్వరి కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘స్టైలిష్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో సాయికుమార్ ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం. తనీష్ పాత్ర సరికొత్తగా ఉంటుంది’’ అని తెలి పారు. తనీష్ మాట్లాడుతూ-‘‘నా పాత్ర విభిన్న కోణాల్లో సాగుతుంది. నా కెరీర్లో మైలురాయిలా నిలిచిపోతుంది ’’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: హ యీష్. ఎస్.ఎన్.