తేజస్వికి తల్లిగా...
సవాల్‌లా అనిపించే పాత్రలు స్వీకరించడం నిత్యామీనన్‌కి చాలా ఇష్టం. అందుకే, తల్లి పాత్ర పోషించడానికి పచ్చజెండా ఊపేశారు. ఏ మూడు, నాలుగేళ్ల బిడ్డకో తల్లయితే ఫర్వాలేదు. టీనేజ్ దాటిన అమ్మాయికి తల్లిగా చేస్తున్నారు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో శర్వానంద్, నిత్యామీనన్ జంటగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కె.యస్. రామరావు నిర్మిస్తున్నారు. ఇందులో తేజస్వికి తల్లిగా నటిస్తున్నారు నిత్యా. వయసుకి మించిన ఈ పాత్రలో నిత్యా ఒదిగిపోతారని నిస్సందేహంగా చెప్పొచ్చు. మరి...
సినిమా మొత్తం ఇదే పాత్రలో కనిపిస్తారా? లేక ఫ్లాష్‌బ్యాక్‌లో యంగ్‌గా కనిపిస్తారా? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందించారు. ఈ చిత్రానికి ‘ప్రేమ వయసెప్పుడూ పదహారే’ని అనే టైటిల్‌ని ఖరారు చేయాలనుకుంటున్నారని సమాచారం.