పెళ్లికి నిరాకరించాడని పాకిస్తాన్ లో..
ఇస్లామాబాద్ : :పాకిస్తాన్ లో ముస్లిం మహిళలపై ఆంక్షలు, ఇస్లాం మత నమ్మకాలు,వాటి ప్రభావం ఎక్కువ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే మధ్య పాకిస్తాన్ లోని నగరంలో మహిళ, పురుషుడిపై యాసిడ్ దాడి చేయడం కలంకలం రేపింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన మఖ్దుం రషీద్ అనేవ్యక్తిపై యాసిడ్ పోసిందో మహిళ.
పోలీసులు అందించిన సమాచారం ముల్తాన్ కుచెందిన మొనిల్ మాయ్ (32) పొరుగుననివసించే రషీద్ పై గురువారం ఈ దాడికి పాల్పడింది. మొనిల్ ను నిఖా చేసుకోవానికి అంగీకరించపోవడంతో ఆగ్రహానికి గురైన ఆమె రషీద్ పై యాసిడ్ గుమ్మరించినట్టు స్థానిక పోలీసు అధికారి బషీర్ అహ్మద్ తెలిపారు. ఆమెను అదుపులోకి ప్రశ్నిస్తున్నామన్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
కాగా మహిళలపై యాసిడ్ దాడులు, పరువు హత్యలు కామన్ గా మారిన పాకిస్తాన్ దేశంలో మహిళలు పురుషులకు వ్యతిరేకంగా హింసకు దిగడం అరుదైన విషయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.