monkeys crowd
-
వానరం.. జర భద్రం!
భద్రాద్రి కొత్తగూడెం : ఏదైనా ప్రమాదం జరిగితే నోరు విప్పి చెప్పుకోలేవు.. ఈ చిత్రాలు చూడండి.. వామ్మో.. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే.. ప్రాణాలతో ఉంటాయా..? అసలే వర్షాకాలం.. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఎవరి ప్రాణాలైనా అంతే సంగతులు.. కొన్ని వానరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ బస్ డిపోలోని ఓ షెడ్లోకి వచ్చాయి. అక్కడ విద్యుత్ స్విచ్ బాక్స్ శిథిలమై ఉంది.. కానీ దాన్ని గమనించక కోతులు స్తంభంపైకి ఎక్కుతూ కనిపించాయి.. బయటకు వచ్చి ఉన్న తీగలు ప్రమాదకరంగా ఉండడంతో వాటి నుండి తప్పించుకోడానికి నానా తిప్పలు పడ్డాయి. ఈ దృశ్యాలను ‘సాక్షి’కెమెరా క్లిక్ మనిపించింది.. -
చెవి కొరికిన కోతి
నల్లగొండ: అసలే కోతి.. మరి దాన్ని.. ఉసిగొల్పితే ఊరుకుంటుందా.. మీద పడి రక్కేస్తుంది.. అచ్చం అలాంటి సంఘటనే నల్లగొండ జిల్లాలో జరిగింది. గుంపుగా వెళ్తున్న కోతులను ఓ ఆకతాయి కుర్రాడు.. రాయితో కొట్టాడు.. అది మాత్రం ఊరుకుంటుందా.. అమాంతం అతని పై దాడి చేసి అతని చెవి కొరికింది. ఈ ఘటన జిల్లాలోని ఆత్మకూరు మండలం కూరెళ్ల గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన కప్పల సోమయ్య ఇంటి నుంచి బయటకు వస్తుండగా రోడ్డుపై కోతుల గుంపు వెళుతోంది. గుంపుగా వెళ్తున్న కోతులుపై సోమయ్య రాయి విసిరాడు.. అంతె ఒక్కసారిగా గుంపులోనుంచి ఒక కోతి దూసుకువచ్చి సోమయ్య ఎడమచెవి కొరికింది. అప్రమత్తమైన సోమయ్య కాళ్లకు పనిచెప్పడంతో పెను ప్రమాదం తప్పింది.