కోతుల నుంచి తప్పించుకునేందుకు..దూకేసింది
నెల్లూరు : కోతుల గుంపు నుంచి తప్పించుకునే యత్నంలో ఓ బాలిక భవనంపై నుంచి కింద పడి తీవ్రగాయాలపాలైంది. ఈ సంఘటన బుధవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని పెళ్లకూరులో చోటు చేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న పల్లవి భవనంపై ఆడుకుంటున్న సమయంలో కోతుల గుంపు ఒక్కసారిగా ఆమెపైకి వచ్చాయి.
దీంతో భయపడిన పల్లవి భవనంపై నుంచి కిందకి దూకింది.ఈ ప్రమాదంలో పల్లవి తీవ్రంగా గాయపడింది. తల్లిదండ్రులు వెంటనే స్పందించి... బాలికను నెల్లూరులోని రామచంద్రారెడ్డి ఆసుపత్రికి తరలించారు.