భార్య మృతికి కారణమైన భర్త అరెస్ట్
కైకరం(ఉంగుటూరు) : భార్య మృతికి కారణమైన గుండు మాల రవి కుమార్ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు చేబ్రోలు ఎస్ఐ చావా సురేష్ చెప్పారు. ఆయన కథనం ప్రకారం.. తల్లాపురం గ్రామానికి చెందిన లతకు, కైకరం గ్రామానికి చెందిన గుండుమాల రవి కుమార్తో 15 ఏళ్ల కిందట వివాహమైంది. మూడేళ్ల నుంచి రవి కుమార్ అనుమానంతో లతను వేధిస్తూ ఉండటంతో విసుగు చెందిన ఆమె ఈనెల 4న భర్త ఎదుటే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఆమె అక్కడ చికిత్స పొందుతూ.. ఈనెల 15న మృతి చెందింది. నిందితుడైన రవి కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు ఎస్ఐ చెప్పారు.