more expensive
-
మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్
సాక్షి,ముంబై: భారతీయ మొబైల్ వినియోగదారులకు త్వరలోనే మొబైల్ బిల్లుల మోత మోగనుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే చౌకైన మొబైల్ డేటాను అనుభవిస్తున్న కస్టమర్లు దాదాపు 10 రెట్ల మేర భారాన్ని భరించాల్సి వుంటుంది. టెలికాం ఆపరేటర్లు కోరిన విధంగా రేట్ల(కనీస రేట్లు)ను నిర్ణయించినట్టయితే ప్రస్తుత స్థాయి నుంచి మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరుగుతాయి. ఇది నిజంగా మొబైల్ వినియోగారుదారులకు షాకింగ్ న్యూసే. ప్రస్తుతం భారతదేశంలో మొబైల్ చందాదారులు ఒక జీబీ కి రూ. 3.5ల చొప్పున 4జీ డేటా ను పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే టెలికాం కంపెనీలు కోరినట్లు ట్రాయ్ నిర్ణయం తీసుకుంటే మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరిగే అవకాశముంది. కనీసం 1 జీబీ ధరను రూ.35 గా నిర్ణయించాలని వోడాఫోన్ ఐడియా, రూ. 30లుగా ఉండాలని, ఎయిర్టెల్, రూ. 20ల కనీస చార్జీగా వుండాలని రిలయన్స్ జియో ఇప్పటికే ట్రాయ్ కి ప్రతిపాదించాయి. తాజాగా ఈప్రతిపాదనలకు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సానుకూలంగా స్పందించారు. ఇటీవలి ఏజీఆర్ సంక్షోభం,టెలికాం రంగానికి భారీగా అప్పులు రావడం, ధరలు నిలకడగా తగ్గడం వల్ల ఇంతకుమించి వేరే మార్గం లేదని,అయితే ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. పరిశ్రమ నుండి వచ్చిన అభ్యర్థన తరువాత కాల్, డేటా సేవలకు కనీస ధరను నిర్ణయించడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కూడా సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు కనీస ధరలను పెంచడం వాంఛనీయం కాదని , తిరోగమన దశ అని, ఇది మార్కెట్ పోటీపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పేర్కొంది. వినియోగదారుల జేబుకు చిల్లు రోజుకు 2 జీబీ 4జీ డేటా అందించే రూ .599 (84 రోజుల వాలిడిటీ) ప్లాన్‌లో (జీబీకి రూ .3.5 రేటు) జీబీకి రూ .20-35 పరిధిలో డేటా ధర నిర్ణయిస్తే ఇదే ప్లాన్‌కు రూ .3,360 రూ. 5,880 మధ్య బాదుడు తప్పదు. -
ఏటీఎం, బ్యాంకింగ్ సేవలపై బాదుడు షురూ
న్యూఢిల్లీ: జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ పన్నుల ప్రభావం ఏటీఏం, బ్యాంకింగ్ సేవలపై భారీగా పడనుంది. కేవలం వివిధ వ్యాపార పరిశ్రమలపైనే కాకుండా ఆర్థిక లావాదేవీలపై కూడా ప్రభావితం చేయనుంది. ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్లను (ఎటిఎంలు) ఏర్పాటు చేయడం ఇక ఖరీదైన వ్యవహారంగా మారనుంది. ముఖ్యంగా జీఎస్టీ పన్ను పరిధిలో ఏటీఎం కేంద్రాలపై పన్ను రేటు గరిష్టంగా 28శాతం నిర్ణయించడంతో ఈ సేవలు ఇకపై ప్రియం కానున్నాయి. దీంతో చిన్నబ్యాంకులు, కొత్తగా ఏర్పాటైన పేమెంట్ బ్యాంకింగ్ సంస్థలపై భారీగా పడనుంది. ముఖ్యంగా ఆర్థిక సేవలపై విధించిన పన్ను పోటుతో వినియోగదారులపై మరింత భారం పెరిగింది. ఆర్థిక సేవల్లో భాగంగా ఏటీఎం లావాదేవీలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, బీమా ప్రీమియం, నెలవారి చెల్లింపులు(ఈఎంఐ)లు మరింత భారం కానున్నాయి. ఏటీఎం ఉపసంహరణలు, నగదు డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు , చెక్ బుక్ జారీ సహా ఇతర బ్యాంకింగ్ సేవలు కొత్త పన్ను పాలన కింద రానున్నాయి. దీని ప్రకారం బ్యాంకింగ్ లావాదేవీలపై 15 శాతానికి బదులుగా 18 శాతం సర్వీస్ టాక్స్ వసూలు చేస్తారు. ఈ పన్నుల స్లాబ్‌లలో మార్పుల ప్రకారం నిర్ణీత లావాదేవీలు ముగిసిన తరువాత రూ.100ల ప్రతి బ్యాంకింగ్ లావాదేవికి, ప్రతి కస్టమర్ రూ.3 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం నగదు డిపాజిట్, ఏటీఏం లావాదేవీలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, బీమా ప్రీమియంలు, ఈఎంఏ చెల్లింపులపై 15 శాతం సేవా పన్నును వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. జీఎస్టీ లాంచింగ్‌కుముందు కౌన్సిల్ తో టాప్ బ్యాంక్ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్బీఐ చైర్ పర్సన్ అరుధంతి భట్టాచార్య మాట్లాడుతూ సర్వీస్ టాక్స్ తో కలిపి జీఎస్టీ వసూలు చేయాలని చెప్పారు. తత్ఫలితంగా ప్రస్తుత సర్వీసు రేటు 15 శాతం 18 శాతానికి చేరుతుందని వెల్లడించారు. ఈ మేరకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, స్టాండర్డ్ చార్టర్డ్ సహా వివిధ బ్యాంకులు చార్జీల విధింపుపై వారి కస్టమర్లకు ఎస్ఎంఎస్ సమాచారాన్ని కూడా అందిస్తుండడం గమనార్హం.