జర్మనీ చేతిలో భారత్ ఓటమి
వలెన్సినా: ఆరు దేశాల ఇన్విటేషన్ హాకీ టోర్నమెంట్‌ను భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 4-0తో భారత్‌ను చిత్తు చేసింది. ప్రథమార్ధంలో 3-0తో ఆధిక్యంలో నిలిచిన జర్మనీ తర్వాతి అర్ధ భాగంలో మరో గోల్ చేసింది. గ్రమ్బష్ రెండు, మోరిట్జ్, విండ్‌ఫెడర్ చెరో గోల్ కొట్టారు.