Mossack Fonessa
-
పనామా పేపర్లు : మళ్లీ సంచలనం
న్యూఢిల్లీ : పనామా పేపర్ల కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండేళ్ల తర్వాత లా కంపెనీ మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన మరికొన్ని పరిశోధనాత్మక పత్రాలు బయటకు వచ్చాయి. దాదాపు 12 లక్షలకు పైగా సరికొత్త పత్రాలను ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) అధ్యాయనం చేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం బయటపెట్టిన పత్రాలన్నింటిని దక్షిణ జర్మనీ వార్తాపత్రిక సేకరించింది. వీటిలో దాదాపు 12 వేల పత్రాలు భారతీయులకు సంబంధించినవి కావడం గమనార్హం. 2016లో దాదాపు 500 మంది భారతీయుల పేర్లు మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన పత్రాల్లో ఉన్నాయి. వీటిపై విచారణ జరిపేందుకు భారత ప్రభుత్వం మల్టీ ఏజెన్సీ గ్రూప్(ఎమ్‌ఏజీ)ను ఏర్పాటు చేసింది. 2016 లీక్‌ల ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఎమ్‌ఏజీ గుర్తించింది. కొత్త లీక్‌లో ఉన్న విషయాలేంటి..? కొత్త పత్రాల్లో భారత్‌కు చెందిన పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు ఉన్నాయి. వీరి పేర్లు 2016 లీక్స్‌లో లేవు. - పీవీఆర్ సినిమా యజమాని అజయ్ బిజ్లీ, ఆయన కుటుంబ సభ్యులు - సునీల్ మిట్టల్ కుమారుడు, హైక్ మెసేంజర్ సీఈవో, భారతీ ఎయిర్టెల్ సీఈవో కవిన్ భారతి మిట్టల్ - ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ అశ్విన్ దాని కుమారుడు జలాజ్ అశ్విన్ దాని వీరికి లింక్‌లు ఉన్నాయని తేలింది.. పనామా పేపర్లలో తమ పేర్లు రావడాన్ని ఖండించిన కొందరు ప్రముఖుల పేర్లు మళ్లీ బయటకు వచ్చాయి. వీరికి ఆఫ్ షోర్ కంపెనీలతో బిజినెస్ లింక్స్ ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలను ఐసీఐజే జర్నలిస్టులు సంపాదించారు. సదరు ప్రముఖుల పేర్లు ఇవే.. - శివ్ విక్రమ్ ఖేమ్కా - నటుడు అమితాబ్ బచ్చన్ - మాజీ సొలిసిటర్ జనరల్ తనయుడు జహంగీర్ సోరబ్జీ - డీఎల్ఎఫ్ గ్రూప్‌కు చెందిన కేపీ సింగ్, ఆయన కుటుంబం - అనురాగ్ కేజ్రీవాల్ - మెహ్రాసన్స్ జ్యువెల్లర్స్‌కు చెందిన నవీన్ మెహ్రా - అండర్ వరల్డ్ డాన్ ఇక్బాల్ మిర్చి భార్య హజ్రా ఇక్బాల్ మెమన్ -
ఇక ఆన్ లైన్ లో పనామా 'నల్ల' పేర్లు!
పనామా సిటీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్లు తాజాగా ప్రజలకు ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో గొప్ప స్థానాల్లో ఉన్న కొందరి అక్రమాలను పనామా పేపర్లు బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఇన్వేస్టిగేటివ్ జర్నలిజంలో ముఖ్య పాత్ర పోషించిన ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వేస్టిగేటివ్ జర్నలిజం (ఐసీఐజే) కోటికిపైగా ఉన్న ఈ డాక్యుమెంట్లన్నింటినీ డిజిటల్ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చేసేవిధంగా నిర్ణయించింది. భారతకాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఆరుగంటల నుంచి పనామా పేపర్లన్నీ ఆఫ్ షోర్ లీక్స్.ఐసీఐజే.ఓఆర్జీ లో అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో సంపద కలిగి ఆఫ్ షోర్ కంపెనీలను కలిగివున్న 2,00,000 మంది పేర్లను ఇందులో వెల్లడించనున్నట్లు ఐసీఐజే తెలిపింది. ఇప్పటివరకు కేవలం పెద్ద ప్రొఫెల్ ఉన్న వ్యక్తుల వివరాలను(ఐస్ ల్యాండ్ ప్రధానమంత్రి, బ్రిటన్ ప్రధాని, రష్యా ప్రెసిడెంట్, అర్జెంటీనా ప్రధానమంత్రి, చైనా రాజకీయ నాయకులు) మాత్రమే న్యూస్ పేపర్ల ద్వారా బయటపెట్టిన ఐసీఐజే తాజాగా తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరుల జాబితా బయటకు రానుంది. అయితే, సమాచారాన్ని ప్రజలకు తెలియజేయండం తప్పంటూ మొస్సాక్ ఫోన్సెకా ఐసీఐజే మీద పిటిషన్ దాఖలు చేసేందుకు లాయర్ ను నియమించుకుంది. దీనికి సంబంధించి ఐసీఐజే ఎటువంటి ప్రకటనా చేయలేదు. డాక్యుమెంట్లను బయటపెట్టడంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది.