mother and baby died
-
శివరాత్రి రోజున విషాదం: తల్లీబిడ్డ మృతి
-
శివరాత్రి రోజున విషాదం: ఏమైందో తెలియదు తల్లీబిడ్డ మృతి
నరసన్నపేట(శ్రీకాకుళం జిల్లా): అనుమానాస్పద స్థితిలో తల్లీబిడ్డ మృతి చెందిన ఘటన నరసన్నపేట మేజర్ పంచాయతీలోని హనుమాన్‌నగర్‌లో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎల్‌ఎన్‌పేట మండలం కొయిలాంకు చెందిన లత(21)కు హనుమాన్‌నగర్‌కు చెందిన లారీ డ్రైవర్ గోకవలస రమేష్‌తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమారుడు తనీష్, కుమార్తె లాస్య(1) ఉన్నారు. గురువారం శివరాత్రి సందర్భంగా కుటుంబసభ్యులంతా ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత అందరూ భోజనం చేసి పడుకున్నారు. లత, లాస్యలు నిద్రలోనే ఉండగా కుమారుడు తనీష్, సోదరుడు చిరంజీవి, తల్లి రాముతో కలిసి రమేష్ బయటకువెళ్లా రు.ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి లత, లాస్యలు మృతి చెందినట్లు గుర్తిం చారు. విషయం తెలుసుకున్న లత తల్లి, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని రోదించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, రమేష్‌తో పాటు తల్లి, సోదరుడు కలిసి భోజనంలో విషం కలిపి హత్య చేశారని ఆరోపించారు. లత తల్లి మద్ది కంచెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తాడుతో గొంతు నులిమి చంపి.. కడతేరిన ‘ఫేస్బుక్’ ప్రేమ -
ఎంత పని చేశావు తల్లీ!
ఆలూరు రూరల్: భర్త దారి తప్పాడు. పెళ్లి ప్రమాణాలను మరచిపోయి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయినా ఆమె భరించింది. కానీ భర్త, అతని ప్రియురాలి వేధింపులు అధికమయ్యాయి. ఇక ఓర్చుకునే శక్తి లేకపోయింది. మూడేళ్ల కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకుంది. తానొక్కతే చనిపోతే బిడ్డకు దిక్కు ఉండరన్న భయంతో ఆ చిన్నారినీ వెంట తీసుకెళ్లిపోయింది. ఈ సంఘటన వినాయక చవితి పండుగ నాడు ఆలూరు పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆలూరులోని గోవర్ధన్ టాకీస్ సమీపంలో నివాసముంటున్న ఏక్నాథ్ ఈరన్న, హైమావతి కుమారుడు నాగార్జునకు కర్ణాటకలోని శిరుగుప్ప తాలూకా దరూరు గ్రామానికి చెందిన చంద్రప్ప, వన్నూరమ్మ కుమార్తె శిల్పా (24)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్ఞానేశ్వరి (3) అనే కుమార్తె ఉంది. నాగార్జునకు పట్టణానికే చెందిన మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఏడాది క్రితం నుంచి ఆ అమ్మాయితో కలిసి వేరే ప్రాంతంలో కాపురం పెట్టాడు. విషయం తెలిసినా శిల్పా ఏమీ చేయలేక.. అత్తామామ దగ్గర ఉండేది. నాగార్జున తన ప్రియురాలిని అప్పుడప్పుడు ఇంటికి కూడా తీసుకొచ్చేవాడు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి శిల్పాను మానసికంగా వేధించేవారు. ఇటీవల కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఇక తన భర్త ప్రవర్తనలో మార్పు రాదని భావించిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తానొక్కతే చనిపోతే బిడ్డ అనాథ అవుతుందని భయపడింది. శనివారం అత్తమామలతో కలిసి పొలానికి వెళ్లింది. అందరూ పొలం పనులలో నిమగ్నమై ఉండగా.. శిల్పా బిడ్డతో సహా సమీపంలోని నీటికుంటలో దూకింది. పొలంలో పనిచేస్తున్న వారు గమనించి బయటకు తీసేలోపు ఇద్దరూ ప్రాణాలు విడిచారు. మృతదేహాలకు ఆలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
తల్లీబిడ్డల హత్య
సాక్షి, పీఎంపాలెం(భీమిలి): కార్‌షెడ్ కూడలికి సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో దారుణం చోటుచేసుకుంది. తల్లీ, ఏడాదిన్నర వయసు గల చిన్నారి హత్యకు గురయ్యారు. పీఎం పాలెం సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఒడిశాలోని రాజ్‌గమ్‌పూర్‌కు చెందిన శుక్రజిత్‌బంజ్‌దేవ్ కార్‌షెడ్ కూడలికి సమీపంలోని జాహ్నవి ఎన్క్లేవ్ మొదటి అంతస్తు 101 ప్లాట్‌లో భార్య సువక్షలాదల్ సమంత, కూతురు ఎలియానా (18 నెలలు)తో కలసి ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం 1.30 సమయానికి ఒడిశా రాష్ట్రం కుందనగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. జాహ్నవి ఎన్‌క్లేవ్‌లోని 101 ప్లాట్‌లో తల్లీబిడ్డా మరణించి ఉన్నారని సమాచారం మేరకు పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ సిబ్బందితో వెళ్లి అపార్ట్మెంట్కి వెళ్లారు. అపార్ట్మెంట్ వాసుల సమక్షంలో 101 గది తలుపునకు వేసిన తాళాలు బలవంతంగా తెరచి చూడగా వంట గదిలో శుక్రజిత్ బంజ్‌దేవ్ భార్య సువక్షలా దల్ సమంత వంట గదిలోనూ ఏడాదిన్నర పాప ఎలియానా బాత్రూంలోనూ విగత జీవులుగా పడి ఉన్నారు. పోలీసులకు కుందనగిరి పోలీసులు ఇచ్చిన సమాచారం తప్ప వివరాలు తెలియరాలేదు. పీఎస్‌లో ఫిర్యాదుతో వెలుగులోకి విషయం.. ఇదిలా ఉండగా భార్య, కుమార్తెల మరణం గురించి ఒడిశాలోని ఉన్న తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది భర్తే. వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్లే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఏమైంది అనేది పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. పోలీసులు స్థానికులను విచారించారు. దంపతులు చీటికి మాటికీ గొడవ పడేవారని.. వారు ఒడియా భాషలో మాత్రమే మాట్లాడడం వల్ల ఎందుకు గొడవ పడుతున్నదీ తెలిసేదికాదని అపార్ట్మెంట్ వాసులు చెప్పారు. ఒడిశా నుంచి మృ తుల కుటుంబ సభ్యులు కార్‌షెడ్ ప్రాంతానికి వస్తున్నారు. వారు వస్తే పూర్తి వివరాలు లభ్యం అవుతాయని సీఐ తెలిపారు. శుక్రజిత్‌బంజ్‌దేవ్ ఆఖరి సారిగా బుధవారం సాయంత్రం కనిపిం చాడని.. తరువాత కనిపించలేదని స్థానికులు తెలిపారు. జంట మరణాలపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
కల్యాణి మోటార్స్‌పై కేసు నమోదు
సాక్షి, బెంగళూరు: ఐదు రోజుల క్రితం కారు దగ్ధమైన ఘటనలో మరణించిన తల్లీకుమారుల కేసులో కల్యాణి మోటార్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మారుతి సుజకి చెందిన సర్వీసింగ్ కేంద్రం కల్యాణి మోటార్స్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ సెక్షన్ 304 ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 2న బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో కారు పార్కింగ్ చేస్తుండగా వాహనం దగ్ధమైంది. ఈ ఘటనలో కారులో ఉన్న తల్లి నేహ, ఆమె నాలుగేళ్ల కుమారుడు పరమ్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కల్యాణి మోటార్స్ విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కారణమని తేల్చారు. వైట్‌ఫీల్డ్ ఏసీపీ సుదమ్ బి.నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఏడు నెలల క్రితం కారు క్లచ్, బ్రేక్ వ్యవస్థను మార్చాలని కల్యాణి మోటార్స్‌లో సర్వీసింగ్‌కు ఇచ్చినట్లు తెలిపారు. కానీ సదరు సంస్థ ఎలాంటి మార్పులు చేయకుండా యజమానికి కారును అప్పగించిందని తెలిపారు. అంతేకాకుండా మెకానిక్ ఎలక్ట్రిక్ వైర్‌ను సరిగ్గా అమర్చలేదని, అందుకే కారు ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ మేరకు కల్యాణి సర్వీస్ సూపర్వైజర్, సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
ఆస్పత్రిలో తల్లీ , బిడ్డ మృతి
తూర్పుగోదావరి : వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, అప్పుడే పుట్టిన మగ శిశువు మృతిచెందారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. రంగంపేట గ్రామానికి చెందిన గర్భిణి.. కోశెట్టి నాగమణి సోమవారం ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను 108లో పెద్దాపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు తల్లీ, బిడ్డ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు మంగళవారం ఉదయం ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. పుట్టిన బిడ్డకు సరైన వైద్యం అందకపోవడంతోనే చనిపోయాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తల్లీ, బిడ్డ మృతి చెందారని వారు ఆరోపించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.