కారు దహనంలో మృతిచెందిన తల్లీ తనయుడు(ఫైల్)
సాక్షి, బెంగళూరు: ఐదు రోజుల క్రితం కారు దగ్ధమైన ఘటనలో మరణించిన తల్లీకుమారుల కేసులో కల్యాణి మోటార్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మారుతి సుజకి చెందిన సర్వీసింగ్ కేంద్రం కల్యాణి మోటార్స్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ సెక్షన్ 304 ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 2న బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో కారు పార్కింగ్ చేస్తుండగా వాహనం దగ్ధమైంది. ఈ ఘటనలో కారులో ఉన్న తల్లి నేహ, ఆమె నాలుగేళ్ల కుమారుడు పరమ్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కల్యాణి మోటార్స్ విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కారణమని తేల్చారు. వైట్‌ఫీల్డ్ ఏసీపీ సుదమ్ బి.నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఏడు నెలల క్రితం కారు క్లచ్, బ్రేక్ వ్యవస్థను మార్చాలని కల్యాణి మోటార్స్‌లో సర్వీసింగ్‌కు ఇచ్చినట్లు తెలిపారు. కానీ సదరు సంస్థ ఎలాంటి మార్పులు చేయకుండా యజమానికి కారును అప్పగించిందని తెలిపారు. అంతేకాకుండా మెకానిక్ ఎలక్ట్రిక్ వైర్‌ను సరిగ్గా అమర్చలేదని, అందుకే కారు ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ మేరకు కల్యాణి సర్వీస్ సూపర్‌వైజర్, సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment