లవర్ కోసం పోటీపడి కన్న కూతుర్ని..
చంఢీగఢ్: ప్రేమ అంటూ ఓ తల్లి ఘాతుకానికి పాల్పడింది. ప్రేమికుడి కోసం జరిగిన పోరులో కన్న కూతుర్ని బలి తీసుకుంది. సినిమాలో ట్విస్ట్ కంటే కూడా ఎక్కువ నాటకీయత చోటుచేసుకున్నా చివరికి న్యాయమే గెలిచింది. కొన్ని రోజుల కిందట దీక్ష(17) చనిపోయింది. ఆమె తల్లి ఇది ఆత్మహత్య అని అందరినీ నమ్మించింది. కానీ చివరికి దీక్ష మరణం వెనుక అసలు రహస్యాలను తెలుసుకుని పోలీసులు, అధికారులు ఆశ్చర్యపోయారు. ఫేస్ బుక్ లవర్ విజయ్ కుమార్ అలియాస్ సోను కోసం కూతుర్ని అంతం చేసింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నరేందర్ పాల్ సింగ్ తెలిపారు.
ఫేస్ బుక్ లో పరిచయం.. ఆపై ఇంట్లో మకాం..
కూతురు దీక్షతో కలిసి తల్లి మంజు పంజాబ్ లోని పంజీర్ లో నివాసం ఉండేది. విజయ్ సౌదీ అరేబియాలో ఉండేవాడు. అయితే 2015 అక్టోబర్ లో ఫేస్బుక్ ద్వారా దీక్ష తల్లి మంజు, విజయ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ఏడాది డిసెంబర్ లో విజయ్ ఇండియాకు తిరిగొచ్చాడు. ఈ జనవరి నుంచి అబోహర్ లో ఉన్న మంజు ఇంట్లోనే విజయ్ మకాం వేశాడు. తల్లితో సహజీవనం చేస్తున్న విజయ్ మెల్లమెల్లగా దీక్షపై కన్నేశాడు. దీక్షతో విజయ్ చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. కూతురు కూడా విజయ్ ను ప్రేమించింది.
అయితే తల్లితో కూడా అతడు సంబంధం పెట్టుకున్నాడన్న విషయాన్ని ఓ రోజు రాత్రి గుర్తించింది. కూతురు ఈ విషయంలో తల్లిని ప్రశ్నించింది. ఇక ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తాను విజయ్ ని ప్రేమిస్తున్నట్లు కూతురికి చెప్పేసింది. తాను కూడా విజయ్ తో గాఢమైన ప్రేమలో ఉన్నట్లు తల్లికి తెగేసి చెప్పింది. ఇక అంతే ప్రియుడు తనకే దక్కాలి, తననే పెళ్లి చేసుకుంటాడంటూ తల్లీకూతుళ్ల మధ్య పోటీ మొదలైంది.
ప్రేమికుడి కోసం కూతురు పోటీ పడుతోందని..
తన ప్రేమ నిజమైందని నిరూపించుకోవడానికి విజయ్ పేరును తన మణికట్టుపై పచ్చ పొడిపించుకుంది. దీంతో తన లవర్ ను కూతురు ఎగరేసుకు పోతుందని తల్లి మంజు భావించింది. ఆమె కోపం రెట్టింపయి కూతుర్ని చంపేందుకు పథకం పన్నింది. ఫ్యాన్ కు ఉరివేసి గత నెల 24న దీక్షను చంపేశారు. కుటుంబ తగాదాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా దీక్ష పేరుతో విజయ్ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. బంధువులు తమ ఆస్తి ఇవ్వలేదని సూసైడ్ చేసుకుందని పోలీసులను నమ్మించాలని చూసింది. అయితే దీక్ష చేతిపై విజయ్ పేరు పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మంజు, విజయ్ లను తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం చెప్పేశారు. లవర్ విజయ్ కోసం కూతుర్ని హత్య చేసినట్టుగా అంగీకరించింది. మంజు ప్లాన్ ప్రకారం దీక్షను చంపేశామని విజయ్ చెప్పాడని ఎస్పీ నరేందర్ పాల్ సింగ్ వివరించారు.