తల్లి డయానా...
అమ్మ జ్ఞాపకం
బ్రిటిష్ యువరాజులు ప్రిన్స్ విలియమ్,ప్రిన్స్ హేరీలు ఇప్పటికీ తల్లి డయానాను ప్రేమగా గుర్తు చేసుకుంటుంటారు. వారి బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్న వారిద్దరూ, ఆమె ఆకస్మిక మరణంతో తమ జీవితాల్లో ఏర్పడిన చీకటి నుంచి తేరుకునేందుకు చాలాకాలమే పట్టిందని, ఇప్పటికీ ఆమె లేని లోటు బాధిస్తూనే ఉంటుందని అంటారు. తమకు సురక్షితమైన జీవితాన్ని ఇచ్చేందుకు ఆమె అడుగడుగునా తపన పడేదని, ప్రతిరోజూ నిద్రించే ముందు తమను ముద్దాడేదని, ఆమె ముద్దుతోనే తమ దినచర్య ముగిసేదని ప్రిన్స్ హేరీ చెబుతారు.