ఆ నీచుణ్ని ఖైదీలు చంపేశారు
రాయ్పూర్: వినకూడని ఘోరమైన నేరం చేసిన ఓ యువకుడ్ని జైల్లో ఖైదీలు చంపేశారు. చత్తీస్గఢ్లోని దుర్గ్ సెంట్రల్ జైల్లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
తాగినమైకంలో తల్లిపై అత్యాచారం చేసిన కోర్టులో 32 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయవాదులు అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. కోర్టు నిందితుడికి రిమాండ్ విధించడంతో దుర్గ్ సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులోనరి బరాక్ నెంబర్ 14లో ఉంచారు. కాగా అతను చేసిన నేరం గురించి జైల్లోని ఖైదీలందరికీ తెలిసింది. ఆ సమయంలో జైల్లో 120 మంది ఖైదీలు ఉన్నారు. ఆ యువకుడు చేసిన నేరాన్ని సహించలేకపోయిన ఖైదీలు బుధవారం రాత్రి అతనిపై దాడిచేసి చంపేశారు. హత్యకేసులో నిందితులుగా ఉన్న సంతోష్, దినేష్ తివారి ఈ హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఇతర ఖైదీలను విచారిస్తున్నారు.