Moto G5S
-
మోటో జీ5ఎస్ ధర తగ్గింది.. పరిమిత కాలమే
సాక్షి, ముంబై: మోటోరోలా వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. జీ5ఎస్ స్మార్ట్‌ఫోన్ ధరను 5వేల రూపాయల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 45వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ సేల్‌లో మోటో జీ5ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపు ధరను మోటోరోలా ట్విటర్ ద్వారా ప్రకటించింది. గతేడాది ఆగస్టులో లాంచ్ అయినప్పుడు రూ.14,999గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ధర తగ్గింపు అనంతరం ప్రస్తుతం రూ.9,999కే అందుబాటులోకి వచ్చింది. అయితే అమెజాన్ ఇండియాలో ప్రత్యేకంగా ఈ తగ్గింపు పరిమిత కాలానికి అంటే... ఈ నెల 11 వరకే అందుబాటులో ఉండనుంది. ఇక మోటో జీ5ఎస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 4జీబీ ర్యామ్, 16ఎంపీ రియర్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధానంగా ఉన్నాయి. We don’t mean to brag but making the first phone call 45 years ago calls for some celebration! So head to @AmazonIn and grab the all-metal #MotoG5s, which comes with 4 GB RAM and a 16MP rear camera, now at just Rs. 9,999. Offer valid till 11/04 only. — Motorola India (@motorolaindia) April 9, 2018 -
మోటో డబుల్ ధమాకా: జీ5ఎస్, జీ5ఎస్ ప్లస్
మోటరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో జీ5ఎస్ ప్లస్' ను స్పెషల్ ఎడిషన్‌గా లాంచ్ చేసింది. తన జీ సిరీస్‌లోని కొత్త డివైస్‌లను మంగళవారం విడుదల చేసింది. ఎఫర్డబుల్ ధరలతో, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను తమ కస్టమర్లకు అందించనున్నట్టు మోటో ఎండీ మధురుసూదిన్ పేర్కొన్నారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో ఈ క్వార్టర్లో 100 శాతం వృద్ధిని సాధించినట్టు చెప్పారు. ఈ రాత్రి 11.59 ని.ల నుంచి అమెజాన్ లో ప్రత్యేకంగా లభించనుంది. దీంతోపాటు మిగతా ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులోఉంటుంది. జీ5 ఎస్ రూ.11,990లోనూ, స్పెషల్ ఎడిషన్‌గా లాంచ్ చేసిన జీఎస్ 5 ప్లస్ ఫోన్ ధరను 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999గా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 15,999గా నిర్ణయించింది.మోటో డివైస్ ద్వారా రూ.1000 ఎక్సేంజ్ ఆఫర్, జియో 50జీబీ 4జీ అదనపు డేటా , నో ఇఎంఐ కాస్ట్ తదితర లాంచింగ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. మోటో జీ5ఎస్ ఫీచర్లు 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ 4 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్ 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 1500 వాట్ టర్బో చార్జింగ్ మోటో జీ5ఎస్ ప్లస్ ఫీచర్లు 5.5 ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.1. 1 2.0 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 13 ఎంపీ పిక్సెల్ రెండు రియర్ కెమెరాలు ఎల్ఈడీ ఫ్లాష్ , ప్రో అండ్ పనోరమా మోడ్ సెల్పీ కెమెరా 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 128 దాకా విస్తరించుకునే సౌలభ్యం 3000 ఎంఏహెచ్ బ్యాటరీ రూ. 15,999 ధరలో ఇది బ్లష్ గోల్డ్, లూనార్ గ్రే లో అందుబాటులో ఉండనుంది. ఇది బ్లష్ గోల్డ్, లూనార్ గ్రే కలర్స్‌లో విక్రయానికి రానుంది. The #MotoG5S is available on @amazonIN & retail stores tonight from 11:59 pm at a special price of 11,999! Get your very own device tonight! pic.twitter.com/FjUXx6USPl — Motorola India (@motorolaindia) August 29, 2017 -
మోటో కొత్త ఫోన్లు.. వీటి హైలెట్ అదే!
లెనోవో ఎట్టకేలకు మోటో జీ5ఎస్, మోటో జీ5ఎస్ ప్లస్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'ఎస్' పేరుతో ఈ స్పెషల్ ఎడిషన్‌ను మొబైళ్లను కంపెనీ తీసుకొచ్చింది. ముందస్తు మోడల్స్ మోటో జీ5, మోటో జీ5 ప్లస్ స్మార్ట్ఫోన్లకు పలు అప్గ్రేడ్లను చేసిన లెనోవో ఈ రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఈ నెల నుంచే వివిధ దేశాల్లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు అమ్మకానికి వస్తున్నాయి. వీటి ధర 249 యూరోలు(సుమారు రూ.18,900), 299 యూరోలు(రూ.22,700) నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. వీటి ఆకర్షణీయమైన ఫీచర్ కెమెరా డెవలప్మెంట్. మోటో జీ5ఎస్ స్మార్ట్‌ఫోన్ 16 మెగాపిక్సెల్‌తో ప్రైమరీ రియర్ కెమెరాను, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటే, మోటో జీ5ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపే రెండు కెమెరాలను కలిగి ఉంది. ఈ రెండు 13 మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తున్నాయి. ముందు వైపు వైండాగిల్ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ సపోర్టుతో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ రూపొందింది. మరో ప్రత్యేక ఫీచర్ ఆల్-మెటల్ యునిబాడీ డిజైన్. మోటో జీ5ఎస్ ఫీచర్లు... ఆండ్రాయిడ్ 7.1 నోగట్ 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ఎస్ఓసీ 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 3000ఎంఏహెచ్ బ్యాటరీ 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ మోటో జీ5ఎస్ ప్లస్ ఫీచర్లు... ఆండ్రాయిడ్ 7.1 నోగట్ 5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ