MRI
-
అల్-షిఫా ఆస్పత్రి ఎమ్ఆర్ఐ సెంటర్లో హమాస్ ఆయుధాలు!
గాజా: అల్ షిఫా ఆస్పత్రిని హమాస్ ఉగ్రవాదులు తమ స్థావరంగా మార్చుకున్నారని గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే అందుకు తగిన ఆధారాలను కూడా బయటపెట్టింది. తాజాగా అల్-షిఫా ఆస్పత్రిలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సేనలు హమాస్ దాచిన ఆయుధాలను బయటపెట్టారు. ఆస్పత్రి ఎమ్ఆర్ఐ స్కానింగ్ సెంటర్లో హమాస్ కమాండ్ కేంద్రాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి జోనాథన్ కాన్రికస్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేశారు. Watch as LTC (res.) Jonathan Conricus exposes the countless Hamas weapons IDF troops have uncovered in the Shifa Hospital's MRI building: pic.twitter.com/5qssP8z1XQ — Israel Defense Forces (@IDF) November 15, 2023 ఎమ్ఆర్ఐ స్కానింగ్ కేంద్రంలో హమాస్ ఆయుధాలకు సంబంధించిన బ్యాగులు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి జోనాథన్ కాన్రికస్ స్వయంగా వెల్లడించారు. ఆ బ్యాగుల్లో ఏకే-47 వంటి భారీ స్థాయి తుపాకులు, మందుగుండు సామగ్రి కనిపించాయని ఆయన వీడియోలో చూపించారు. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఆస్పత్రులను హమాస్ ఉగ్రవాద కేంద్రంగా మార్చిందని ఆయన ఆరోపించారు. అల్-షిఫా ఆస్పత్రిని హమాస్ స్థావరంగా మార్చుకుందని ఇజ్రాయెల్ సేనలు ఆరోపిస్తున్నాయి. ఆస్పత్రి అంతర్భాగంలో సొరంగాలు ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాదుల ఇళ్ల నుంచి ఆస్పత్రికి నేరుగా సొరంగ మార్గాలను కనుగొన్నామని సైన్యం వెల్లడించింది. అల్-షిఫా ఆస్పత్రి పరిసరాల్లో కొద్ది రోజుల పాటు హమాస్-ఇజ్రాయెల్ సేనలకు మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఆస్పత్రికి కొద్ది రోజులుగా నీరు, ఆహారం, ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో చిన్నారులతో సహా వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇదీ చదవండి: జిన్‌పింగ్ ఓ నియంత.. బైడెన్ నోట మళ్లీ అదే మాట! -
ఆ వైద్యుల్లో మానవత్వం చనిపోయింది
న్యూఢిల్లీ: కొన్ని సంఘటనలు మానవత్వం చనిపోతుందన్న విషయాన్ని, తిరిగిదానికి జీవం పోయాలన్న విషయాన్ని గుర్తుచేస్తుంటాయి. బీహార్‌కు చెందిన మధునిక గుప్తా అనే మహిళ తన భర్త బబ్లూ తల ముందు భాగం పెరిగిపోతుండటంతో గయ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు ఎయిమ్స్ తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. దీంతో ఆయనను ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడి వారు ఎలాంటి సమాధానం చెప్పారో.. ఆ సమాధానం చెప్పాక ఢిల్లీలో ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రి తలుపుతట్టినవారికి ఎలాంటి ఆదరణ లభించిందో తెలుసుకుంటే కళ్లు చెమ్మగిల్లాల్సిందే. మధునిక గుప్తా తన భర్త బబ్లూ తొలుత ఎయిమ్స్‌కు వెళ్లగా ఆయనకు ఎమ్ఆర్ఐ స్కాన్ చేయాల్సిన అవసరం ఉందని, అయితే, ప్రస్తుతం ఎమ్ఆర్ఐ ఏడు నెలల వరకు ఖాళీలేదని, మరో ఆస్పత్రికి వెళ్లాలని సలహా ఇచ్చారు. కానీ, రూ.12 వేలు ఖర్చు భరించలేని ఆ దంపతులు ఇప్పటికే తమ ఆస్తులు మొత్తం అమ్మి ఖాళీ చేతులతో మిగిలామని చెప్పారు. ఎంత బ్రతిమాలుకున్నా వినలేదు. దీంతో అసలు ఆస్పత్రుల స్పందన ఎలా ఉంటుందా అని వారి సహాయంతో పరీక్షించి చూడగా ఢిల్లీలో ఏ ఒక్క వైద్యుడిలో కూడా మానవత్వ ఛాయలు కనిపించలేదు. ఖాళీ లేదు, మేం ఏం చేయలేం, మా డిపార్ట్మెంట్ కాదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి, ఒక్కసారి చెప్తే అర్థం కాదా వంటి కసుర్లు విస్తుర్లే వినిపించాయి. ఈ మొత్తాన్ని ఆ టీవీ చానెల్ రహస్యంగా రికార్డు కూడా చేసింది. ఈ విషయంపై ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రిని సంప్రదించగా వైద్యులు చేసిందే ముమ్మాటికీ తప్పే అని సమాధానం ఇచ్చారు. చివరికి ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో మధులిక గుప్తా తన భర్తకు ఎమ్ఆర్ఐ చేయించుకుంది.