కోరుట్ల బంద్ సక్సెస్
కోరుట్ల : కోరుట్లను రెవెన్యూ డివిజన్ చేయాలని సాధన సమితి ఇచ్చిన పిలుపు పట్టణంలో విజయవంతమైంది. ఉదయం నుంచి వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు బంద్ పాటించాయి. సాధన సమితి అధ్యక్షుడు చెన్న విశ్వనాథం, జక్కుల ప్రసాద్, పేట భాస్కర్, ఇందూరి సత్యం, గండ్ర రాజనర్సింగరావు, తిరుమల గంగాధర్‌తోపాటు వంద మంది ర్యాలీ నిర్వహించారు.
తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
సాధన సమితి ప్రతినిధులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. సీఐ సురేందర్ ఆధ్వర్యంలో ఎస్సైలు కృష్ణకుమార్, జానీబాషా ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో నాయకులు గేట్ వద్ద బైఠాయించారు. తహసీల్దార్ మధు అనుమతితో లోపలికి వెళ్లారు. పట్టణంలో విధించిన 144 సెక్షన్ ఎత్తివేయాలని, కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలంటూ వినతిపత్రం సమర్పించారు. రెవెన్యూ డివిజన్ కోరుతూ సాధన సమితి అధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షల్లో మంగళవారం నాÄæూబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.