రేపు.. 'శ్రీమతి రాజమండ్రి' పోటీ
సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పేలా 'శ్రీమతి రాజమండ్రి' పోటీలను శనివారం నాడు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారిని వివిధ రౌండ్లలో ఎంపిక చేసి, చివరి సెమీఫైనల్స్ను గురువారం నిర్వహించారు. ఇంతకుముందు కూడా మిసెస్... అంటూ పోటీలు జరిగినా, అవి ప్రధానంగా అందాల పోటీల్లాగే జరిగేవని, కానీ ఇక్కడ మాత్రం కట్టు, బొట్టు, నడత, నడక, సంప్రదాయం.. అన్నింటికీ పెద్దపీట వేస్తామని పోటీల నిర్వాహకుడు, విక్టరీ ఈవెంట్ మేకర్స్ అధినేత విక్టర్ తెలిపారు.
పోటీలో పాల్గొనే ప్రతివారూ తప్పనిసరిగా చీరల్లోనే రావాలన్నారు. ఫైనల్ పోటీలు మూడు రౌండ్లలో జరుగుతాయి. తొలి రౌండులో పోటీదారులు తమను పరిచయం చేసుకుంటారు. రెండోరౌండులో వారి ప్రతిభను న్యాయ నిర్ణేతలు పరిశీలిస్తారు. మూడో రౌండులో సమాజంలో మహిళల పాత్ర గురించి, జనరల్ నాలెడ్జి మీద ప్రశ్నలుంటాయి. వారి మానసిక ప్రవర్తన, కేశ సంరక్షణ, చర్మ సౌందర్యం అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని విజేతలను నిర్ణయిస్తారు.