MSD
-
జండర్ న్యూట్రల్ వ్యాక్సిన్ వచ్చేసింది
న్యూఢిల్లీ: జండర్ న్యూట్రల్(ఆడా, మగా అందరూ తీసుకోదగిన) హెచ్‌పీవీ టీకా గార్డ్‌సిల్9ను ఎంఎస్డీ ఫార్మా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 9 వాలెంట్ హెచ్‌పీవీ వైరస్ టీకా హెచ్‌పీవీ టైప్స్ 6, 11,16, 18, 31, 33, 45, 52, 58 రకాలపై పనిచేస్తుందని తెలిపింది. హెచ్‌పీవీ కారణంగా వచ్చే పులిపర్లలాంటివాటి నిరోధంలో, ఈ వైరస్ల కారణంగా కలిగే క్యాన్సర్ల నిరోధంలో టీకా ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది. మగ(9–15 సంవత్సరాలు), ఆడ(9–26 సంవత్సరాలు)వారికి ఈ టీకాను ఇవ్వవచ్చని, గార్డ్‌సిల్9 విడుదల ఆరోగ్యవంతమైన భారత నిర్మాణంలో కీలక మలుపని కంపెనీ డైరెక్టర్ రెహాన్ ఖాన్ చెప్పారు. ఈ వైరస్లు ఆడవారికి, మగవారికి సోకుతాయి, అందువల్లనే జెండర్ న్యూట్రల్(ఎవరైనా తీసుకోగలిగేది) టీకా తెచ్చామన్నారు. పిల్లల్లో, వారి తల్లిదండ్రుల్లో ప్రివెంటివ్ కేర్ గురించి, హెచ్‌పీవీ దానివల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచేందుకు చర్యలు అవసరమన్నారు. (కరోనా దెబ్బ.. ఆయుషు తగ్గింది!) -
జైడస్ చేతికి ఎంఎస్డీ బ్రాండ్లు
ఆరు బ్రాండ్లను కొనుగోలు చేసిన జైడస్ న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఎంఎస్డీకు చెందిన ఆరు బ్రాండ్లను జైడస్ క్యాడిలా సంస్థ కొనుగోలు చేసింది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. ఎంఎస్డీ, అనుబంధ సంస్థలకు చెందిన ఆరు బ్రాండ్లను తమ కంపెనీ పూర్తి అనుబంధ కంపెనీ జైడస్ హెల్త్‌కేర్ కొనుగోలు చేసిందని జైడస్ క్యాడిల్ పేర్కొంది. 140కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెర్క్ అండ్ కంపెనీకి ఎంఎస్డీ ఇండియా అనుబంధ కంపెనీగా వ్యవహరిస్తోంది. జైడస్ కొనుగోలు చేసిన బ్రాండ్లు–డెక–డ్యురబొలిన్, డ్యురబొలిన్, సస్టనాన్, మల్టీలోడ్, సికాస్టట్, యాక్సెటెన్లు 2015లో రూ.84 లక్షల అమ్మకాలు సాధించాయి. ఈ డీల్‌లో భాగంగా ఈ ఆరు బ్రాండ్లకు సంబంధించి పంపిణి, వాణిజ్యపరమైన హక్కులు, ట్రేడ్‌మార్క్ అసైన్మెంట్ జైడస్ హెల్త్‌కేర్‌కు బదిలీ అవుతాయి. ఈ ఆరు బ్రాండ్ల కొనుగోళ్లతో తమ ఔషధ పోర్ట్‌ఫోలియో మరింత శక్తివంతం అవుతుందని జైడస్ హెల్త్‌కేర్ చైర్మన్ షర్విల్ పటేల్ పేర్కొన్నారు. డెక–డ్యురబొలిన్, డ్యురబొలిన్లు ఓస్టియోపొరొసిస్(ఎముకల బోలు వ్యాధి)నివారణకు, సస్టనాన్ పురుషుల ఆరోగ్య సెగ్మెంట్‌కు సంబంధించిన ఈ ఔషధాన్ని టెస్టోస్టిరాన్ హార్మోన్ రీప్లేస్మెంట్ ధెరపీలోనూ, మల్టీలోడ్ మహిళల గర్భనిరోధక ఐయూడీ డివైస్, సికాస్టట్, గాయాలను తగ్గించడంలోనూ, యాక్సెటెన్ అధిక రక్తపోటు చికిత్సలోనూ ఉపయోగిస్తారు.