అందుకు సినిమాలే సరైన దారి
‘‘సినిమాలైతే... వినోదంతో పాటు మనం చెప్పే విషయాలను యువత అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే, మంచి విషయాలను సినిమాల ద్వారా చెప్పాలనుకున్నా’’ అని ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఇన్సాన్ అన్నారు. ‘ఎం.ఎస్.జి.’, ‘ఎం.ఎస్.జి.-2’ సినిమాల తర్వాత హనీప్రీత్ దర్శకత్వంలో ఆయన టైటిల్ పాత్రలో నటించిన ‘ఎం.ఎస్.జి.- ద వారియర్ లయన్ హార్ట్’ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, పంజాబీ భాషల్లో అక్టోబర్ 7న రిలీజవుతోంది. బుధవారం హైదరాబాద్లో గుర్మీత్ మాట్లాడుతూ - ‘‘గురువులా కాకుండా ఓ యోధుడి పాత్రలో నటించా. రైతులు, మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ అంశాల గురించి సినిమాలో చర్చించా. సకల ధర్మాలు, వేదాల గురించి చెబుతూ చేసిన సినిమా వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశం ఉంది’’ అన్నారు.