Mt Everest
-
తెలంగాణ శిఖరం
-
ఎవరెస్ట్ పర్వతారోహణకు ఎంపికైన ఆరుగురు అభ్యర్థులు
-
తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఘనత
ఎవరెస్ట్‌ను అధిరోహించిన నెల్లూరీయుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అశోక్‌వర్ధన్ నెల్లూరు: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కీర్తిప్రతిష్టలను మరోసారి చాటిచెప్పారు విశ్వనాథ అశోక్‌వర్ధన్. అమెరికాలోని కాలిఫోర్నియాలోగల గుగూల్ ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అశోక్ ఈ నెల 5వ తేదీన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన విశ్వనాథ రాఘురామ్, మారుతీదేవి దంపతుల కుమారుడైన అతడు 2008 ఎంసెట్‌లో 13వ ర్యాంక్ సాధించి దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నుంచి బంగారు పతకం అందుకున్నారు. బీటెక్ తరువాత 2012లో గుగూల్లో చేరారు. ఖాళీ సమయంలో పర్వతారోహణ చేసే అతడు గతనెల 30 ప్రారంభించి ఈనెల ఐదో తేదీన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అశోక్ తల్లిదండ్రులను నెల్లూరులో పలువురు అభినందించారు. -
మౌంట్ ఎవరెస్ట్ మీదుగా నేపాల్‌కు రైలు
బీజింగ్ : భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటున్న డ్రాగన్ మరో ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. భారత్ మార్కెట్లోకి సులభంగా ప్రవేశించేందుకు చైనా రంగంలోకి దిగింది. చైనా నుంచి నేపాల్‌కు ప్రపంచంలో అత్యంత ఎతైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ మీదుగా రైలు మార్గం వేయాలని నిర్ణయించినట్లు ఆ దేశ రైల్వే రంగం నిపుణుడు వాంగక మెంగ్ష్ స్థానిక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. టిబెట్ ప్రాంతంలోని మౌంట్ ఎవరెస్ట్ కొమలంగ్మా శిఖరం అడుగు భాగాన సొరంగం తవ్వనున్నట్లు తెలిపారు. భారీ పొడవైన సొరంగం నిర్మించవలసి ఉంటుందన్నారు. పర్వత ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ... ఈ నేపథ్యంలో రైలు వేగం 120 కిలోమీటర్లు మించకూడదని వాంగక మెంగ్ష్ పేర్కొన్నారు. చైనా గతంలో నేపాల్‌తో వ్యాపారం బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు క్వింగ్హై - లాసా మార్గంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. అయితే కొత్తగా సొరంగ మార్గం ద్వారా నేపాల్‌కు రైల్వే లైన్ నిర్మించాలని చైనా నిర్ణయించింది. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లలో ఒక్కటైన భారత్‌లో ప్రవేశించేందుకు నేపాల్ రైలు మార్గాన్ని చైనా ఉపయోగించుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.