
తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఘనత
ఎవరెస్ట్‌ను అధిరోహించిన నెల్లూరీయుడు
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అశోక్‌వర్ధన్
నెల్లూరు: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కీర్తిప్రతిష్టలను మరోసారి చాటిచెప్పారు విశ్వనాథ అశోక్‌వర్ధన్. అమెరికాలోని కాలిఫోర్నియాలోగల గుగూల్ ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అశోక్ ఈ నెల 5వ తేదీన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.
నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన విశ్వనాథ రాఘురామ్, మారుతీదేవి దంపతుల కుమారుడైన అతడు 2008 ఎంసెట్‌లో 13వ ర్యాంక్ సాధించి దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నుంచి బంగారు పతకం అందుకున్నారు. బీటెక్ తరువాత 2012లో గుగూల్‌లో చేరారు. ఖాళీ సమయంలో పర్వతారోహణ చేసే అతడు గతనెల 30 ప్రారంభించి ఈనెల ఐదో తేదీన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అశోక్ తల్లిదండ్రులను నెల్లూరులో పలువురు అభినందించారు.