నూతన సంప్రదాయానికి నాంది
అనంతపురం కల్చరల్: సాధారణంగా పెళ్లిళ్లకో, మరో శుభకార్యానికో హాజరైన వారికి చిన్నపాటి జ్ఞాపికను అందివ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అనంతపురానికి చెందిన వ్యాపారవేత్త ముచ్చుకోట నరసింహారెడ్డి, నారాయణమ్మ దంపతులు వినూత్నంగా ఆలోచించారు. శనివారం జరిగిన తమకుమారుడు హరినాథరెడ్డి వివాహ వేడుకకు హాజరైన అతిథులకు, బంధుమిత్రులకు ‘సంపూర్ణ ఆరోగ్యానికి జీవన సూత్రాలు’ అన్న పుస్తకాన్ని అందించారు. నిత్య జీవితంలో ఎదురయ్యే పలు రుగ్మతలకు ప్రకృతి వైద్యంతో చేసుకునే చికిత్సలు ఈ పుస్తకంలో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఇలాంటి పుస్తకాలు ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా నరసింహారెడ్డి పేర్కొన్నారు.